నాని టేస్ట్ అంత బ్యాడ్ హ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-06 14:56:20

నాని టేస్ట్ అంత బ్యాడ్ హ?

న్యాచురల్ స్టార్ అయిన నాని ప్రస్తుతం అటు సినిమాలతో అలాగే బిగ్ బాస్ తో బిజీ బిజీ గా ఉన్నాడు, ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నాని వరుస సినిమాల్ని ఒప్పుకుంటున్నాడు. ఇటివలే నాని ,చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడు అని తెలుస్తుంది.

అయితే ఈ కథని చంద్రశేఖర్ యేలేటి ఇదివరకు ముగ్గురు హీరోలకి చెప్పాడట. అందులో మొదట చెప్పిన హీరో గోపీచంద్, కాని గోపీచంద్ ఫ్లాప్స్ లో ఉన్నాడు కాబట్టి రిస్క్ చేయలేక చంద్రశేఖర్ యేలేటి కథకి నో చెప్పాడు. ఆ తరువాత చంద్రశేఖర్ యేలేటి అదే కథని సాయి ధరం తేజ్ దగ్గరకి తీసుకొని వెళ్ళాడు.

అయితే సాయి ధరం తేజ్ కూడా అచ్చం గోపీచంద్ లాగ అలోచించి కథని రిజెక్ట్ చేసాడు, ఇక ఈ ఇద్దరు హీరోలు అయిపోయాక యంగ్ హీరో నితిన్ కి కథ చెప్పాడు చంద్రశేఖర్ యేలేటి. కాని నితిన్ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని ఒప్పుకోలేదు. ఇప్పుడు చంద్రశేఖర్ యేలేటి అదే కథని నానికి చెప్తే నాని ఓకే చేసాడు. అయితే ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసిన కథని నాని ఓకే చేసాడు అంటే నాని టేస్ట్ ఇంత బ్యాడ్ హా అని అన్నవారు లేకపోలేదు. మరి నాని కి ఈ సినిమా కథలో అంతగా ఎం నచ్చిందో తెలియాలి అంటే మూవీ కోసం ఆగాల్సిందే. 

షేర్ :