బిగ్ బాస్ పై నాని హీరోయిన్ కామెంట్స్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bigg boss 2
Updated:  2018-09-03 04:51:28

బిగ్ బాస్ పై నాని హీరోయిన్ కామెంట్స్

స్నేహితుడా సినిమాలో నాని సరసన “ఇంతకి నువ్వేవ్వరు వరుసకు నాకెవ్వరు” అంటూ నటించిన మాధవి లతా గుర్తుండే ఉంటుంది. ఆమె ఆ తర్వాత నటించిన చిత్రాలేవి పెద్దగా పనవ్వలేదు. దాంతో ఈ పాప చిత్ర సీమ లో కనుమరుగయ్యింది. మొన్నీమధ్య తన అజ్ఞాతవాసానికి కాస్టింగ్ కౌచ్ కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి మల్లి బుల్లితెర మీద దర్శనం ఇచ్చింది.
 
తాజాగా మల్లి ఈమె తను బిగ్ బాస్-2 మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రజల తీర్పుని పరిగణలోకి తీసుకోకుండా వారి వారి ఇష్టం మేరకు ఇంటి సభ్యులను తొలగించడం ఎం బాలేదని ఈమె అభిప్రయపడింది.నూతన్ నాయుడు కి అందరికన్నా ఎక్కువ వోట్లు వచ్చినా సరే అతన్ని ఎలిమినెట్ చేశారు.
 
ఇలా చేసేదానికి ప్రజల నుండి ఓట్లు అడగడం దేనికి, వారికి నచ్చినవారిని ఉంచుకుని మిగతావారిని పంపెయ్యోచ్చు కదా? అంటూ ఆమె తన అసంతృప్తిని వెలిబుచ్చింది. అతిధి లో చిన్న పాత్ర పోషించి ఆ తరవాత నచ్చావులే ద్వారా హీరొయిన్ అయిన ఈ ముద్దుగుమ్మ అరవింద్2 లో కుడా నటించింది. ఆ తరవాత ఒక తమిళ్ చిత్రం లో కనబడి కనుమరుగయ్యింది.
 
బిగ్ బాస్ ని మొదటి సీజన్ లో జూనియర్ ఎన్ టి ఆర్ ఒక స్థాయికి తీసుకెళ్ళి సూపర్ హిట్ చేసాడు. నాని కుడా రెండవ సీసన్ ని మొదటి సీసన్ అంత కాకపోయినా పరవాలేదు అన్నట్టు హిట్ చెయ్యడానికి కృషి చేస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.