ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అవ్వాల్సిందే అంటున్న నాగ శౌర్య

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

naga sourya
Updated:  2018-08-18 01:43:32

ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అవ్వాల్సిందే అంటున్న నాగ శౌర్య

ఈ ఏడాది “ఛలో” చిత్రంతో మంచి విజయం సాధించిన నాగశౌర్య, ఆ తర్వాత చేసిన “కణం” “అమ్మమ్మగారిల్లు” చిత్రాలతో వరుస పరాజయాల్ని అందుకున్నాడు. అయితే ఆయన తాజాగా  నటిస్తున్న చిత్రం “నర్తనశాల”. ఈ చిత్రంతో శ్రీనివాసరావు అనే నూతన దర్శకుడు పరిచయం కాబోతుండగా ఉషా ముల్పూరి, శంకర్‌ ప్రసాద్‌ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
హీరోయిన్లు కాశ్మీరా, యామినిలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆగష్టు 30 న రిలీజ్ కి రెడీ గా ఉంది. ఇక ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 24న హైదరాబాద్ లో ఘనంగా చేయనున్నట్లు సమాచారం. కానీ సినిమాకి ఇప్పటి వరకు కరెక్ట్ బిజినెస్ కాలేదు అని ఫిలిం నగర్ సమాచారం.
 
అయిన గానీ ఎట్టి పరిస్థితుల్లో సినిమా అదే రోజు రిలీజ్ అవ్వాల్సిందే అని నాగ శౌర్య పట్టు బట్టుకొని కూర్చుకున్నాడు అంట. ఎందుకంటే నాగ శౌర్య సొంత ప్రొడక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఒక వేళా సినిమా రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే అది ప్రొడక్షన్ హౌస్ కి మంచిది కాదు అని నాగ శౌర్య అభిప్రాయం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.