"నర్తనశాల" సినిమా రివ్యూ.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

narthanasala review
Updated:  2018-08-30 01:22:32

"నర్తనశాల" సినిమా రివ్యూ.

"ఛలో" సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ని అందుకున్నాడు నాగ శౌర్య. అదే ఊపులో ఇప్పుడు "నర్తనశాల" అనే సినిమాని చేసాడు నాగ శౌర్య. ఈ సినిమా లో నాగ శౌర్య రిస్క్ చేసి మరి గే గా నటించాడు. ఆ విషయం ఈ సినిమా టిజర్ చూడగానే అర్ధం అవుతుంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని కొత్త దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి డైరెక్ట్ చేసాడు. ఐరా క్రియేషన్స్ పై నాగ శౌర్య అమ్మ ఉష ముల్పురి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసారు. మరి "ఛలో" సక్సెస్ ని "నర్తనశాల" కంటిన్యూ చేసిందా లేదా అనేది రివ్యూ లో చూద్దాం.
 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే కళామందిర్ కళ్యాణ్ (శివాజీ రాజ) తనకి కూతురు పుట్టాలి అని అనుకుంటాడు, కానీ ఎన్ని పూజలు చేసి గాని కొడుకే పుడతాడు. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలియకూడదు అని చెప్పి కళామందిర్ కళ్యాణ్ కొడుకునే కూతురిగా పెంచుతాడు. అయితే పెరిగాక కూడా రాధా కృష్ణ (నాగ శౌర్య) కి అమ్మాయిల మీద ఫీలింగ్స్ రావు. ఇలాంటి టైం లో కళ్యాణ్ తన కొడుక్కి పెళ్లి చేద్దాం అని ఫిక్స్ అవుతాడు. కానీ ఒకవైపు రాధా కృష్ణ మానస (కాశ్మీరీ) అనే అమ్మాయి మీద ఫీలింగ్స్ పెంచుకొని ప్రేమలో పడతాడు. అయితే ఒక చిన్న అపార్ధం వల్ల కళ్యాణ్ రాధా కృష్ణ పెళ్లి సత్య తో(యామిని) ఫిక్స్ చేస్తాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది, రాధా కృష్ణ సత్యతో పెళ్లిని ఎలా ఆపాడు, ఫైనల్ గా రాధా కృష్ణ తను ప్రేమించిన మానస ని పెళ్లి చేసుకున్నాడ లేడా ? అసలు రాధా కృష్ణ గే నా కాదా అనేది మిగిలిన కథ.
 
ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోల్లు ఏ హీరో కూడా చేయని సాహసం నాగ శౌర్య చేసాడు. ఒక సినిమాలో గే పాత్ర్ర చేయడం అనే మామూలు మాటలు కాదు, కానీ నాగ శౌర్య మాత్రం ఈ పాత్రని చాల ఈజ్ తో చేసాడు. ఎప్పటిలాగే నాగ శౌర్య తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇది వరకు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు నాగ శౌర్య. ఒక రకంగా చెప్పాలి అంటే నాగ శౌర్య తన నటన ద్వారా మాత్రం ప్రేక్షకులని అస్సలు డిసప్పాయింట్ చెయ్యడు. ఇకపోతే ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అంటే హీరోయిన్స్ అని చెప్పొచ్చు. కష్మీర, యామిని ఇద్దరు తమ నటనతో మెప్పించలేకపోయారు. కొన్ని సీన్స్ అయితే వీలిద్దరిని చూడలేకపోతాము. శివాజీ రాజ, జయప్రకాశ్ రెడ్డి తమ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడే వచ్చే సీన్స్ బాగుంటాయి.
 
ఇక టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్తే విజయ్ సి కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి తనదైన వర్క్ ని అందించాడు. సినిమాని చాలా కూల్ గా చూపించాడు విజయ్. ఈ సినిమాకి ఎడిటర్స్ గా వ్యవహరించిన కోటగిరి వెంకటేశ్వర్ రావు, తమ్మి రాజు సినిమాని ఇంకాస్త షార్ప్ గా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. ఇక మణిశర్మ కొడుకు స్వర సాగర్ మహతి అందించిన సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. పాటల విషయం లో అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మంచి శ్రద్ధ తీసుకున్నాడు సాగర్. ఇక సినిమా కథ కథనాల విషయానికి వస్తే ఆ విషయాల పరంగా సినిమా చాలా డల్ అని చెపొచ్చు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి ఈ సినిమాతో అస్సలు మెప్పించలేకపోయాడు. కథ పాతదే కథనం కూడా పాతదే పెట్టడం పైగా దర్శకత్వంలో కూడా కొత్తధనం చూపించలేకపోయాడు దర్శకుడు. ఇకపోతే ఐరా క్రియేషన్స్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సొంత కొడుకు సినిమా కాబట్టి ఈ సినిమా నిర్మాత ఉష బాగానే ఖర్చు పెట్టింది అని అర్ధం అవుతుంది. 
 
మొత్తంగా చూసుకుంటే "నర్తనశాల" సినిమా నుంచి అందరూ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రేక్షకుల్ని నవ్వించడానికి చేసిన ఈ "నర్తనశాల" ప్రయత్నం పూర్తిగా విఫలం అయ్యింది. కాస్తో కూస్తో నాగ శౌర్య నటన కోసం అలాగే సినిమాలో అప్పుడప్పుడు వచ్చే సింగల్ లైనర్స్ కోసం సినిమా ని భరించొచ్చు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.