అనుష్కకి ఆసరాగా నాని ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine anushka and hero nani
Updated:  2018-07-16 05:02:28

అనుష్కకి ఆసరాగా నాని ?

తెలుగు లో మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్ యేలేటి. ఆయన నుంచి రెండేళ్ళ క్రితం "మనమంతా" అనే సినిమా వచ్చింది ఆ తరువాత ఆయన ఏ సినిమాని స్టార్ట్ చేయలేదు. కాని ఆయన తీయబోయే తదుపరి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇప్పటికే కథ చర్చలు పూర్తిచేసుకున్న ఈ సినిమా నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటె మొదట ఈ సినిమాలో హీరోగా నితిన్ నటిస్తాడు అనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరో నితిన్ కాదు అని నాని అని ఫిలిం నగర్ లో వార్తలు హలచల్ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అయిన అనుష్క కూడా నటిస్తుంది అని టాక్. మొదట ఈ కథని లేడీ ఓరియెంటెడ్ కథగా రాసుకున్నాడు అట చంద్రశేఖర్ యేలేటి.

కాని కథలో ఒక ముఖ్య పాత్ర కోసం ఒక హీరో కావలి అందుకే నానిని తీసుకున్నాడు అంట చంద్రశేఖర్ యేలేటి. అయితే కథా పరంగా అనుష్క ఇంకా నాని ఇద్దరివి ప్రధాన పాత్రలే కావడం విశేషం. మొత్తానికి నాని సహకారంతో అనుష్క సినిమా పట్టలేక్కుతుంది. ఇంకా ఈ విషయానికి సంభందించిన అధికారిక ప్రకటన నిర్మాతల నుంచి వెలువడాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.