భ‌ర్త‌ని ఎన్నుకున్న న‌య‌న‌తార‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nayanathara marriage
Updated:  2018-03-25 11:53:10

భ‌ర్త‌ని ఎన్నుకున్న న‌య‌న‌తార‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం ష‌రామాములే. అయితే వాటిలో చివ‌రి దాకా జీవించినవారు చాలా అరుదు అని చెప్ప‌వ‌చ్చు. గ‌త కోంతకాలంగా ప‌రిశ్ర‌మ‌లో ఉన్న స్టార్ క‌థానాయిక‌లు వ‌రుస‌గా పెళ్లిళ్లు చేసుకుంటూ అభిమానుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నారు.... అయితే ఇటీవ‌ల స్టార్ హీరోయిన్ శ్రియ విదేశీ టెన్నీస్‌ అట‌గాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం అంద‌రికి తెలిసిందే.
 
నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ ఇద్దరూ గ‌త కొంతకాలంగా ప్రేమించుకుంటున్న‌ విషయం తెలిసిందే. ఇరువురు కలిసి ఫారిన్‌ ట్రిప్స్‌కి వెళ్లడం, బర్త్‌డేలను, పండగలను బాగా సెలబ్రేట్‌ చేసుకోన్న విష‌యాన్ని అభిమానుల‌కు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.  ఈ కార్య‌క్ర‌మాల ద్వారా నయనతార- విఘ్నేశ్‌ శివన్ మ‌ధ్య మంచి బాండింగ్ ఏర్ప‌డింద‌న్న విష‌యం అభిమానులు  తెలుసుకున్నారు. అయితే వీళ్లు ప్రేమించుకున్న విష‌యం ఇద్దరూ ఎక్కడా పెదవి విప్పలేదు.
 
అయితే ఇటీవల చెన్నైలో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్‌కు హ‌జ‌రైన హీరోయిన్ నయనతార అవార్డు తీసుకుంటూ నన్ను ఎల్లవేళలా సపోర్ట్‌ చేస్తున్న అమ్మా, నాన్న, సోదరుడు అలాగే నా ఫియాన్సీ వీళ్లందరికీ థ్యాంక్స్ అని న‌య‌న‌తార‌ అన్నారు. నయనతార ఫియాన్సీ ఎవరో కాదు..విఘ్నేష్‌ శివన్‌’. ఇప్పటివరకూ రిలేషన్‌షిప్‌ గురించి నోరు విప్పని నయన డైరెక్ట్‌గా ఫియాన్సీ అన్నారంటే.. త్వరలో ఈ జంట పెళ్లి పీటల మీద కూర్చుంటారేమో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.