పెళ్లి పీట‌ల‌కేనా ఈ ప్రేమ‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-17 05:56:34

పెళ్లి పీట‌ల‌కేనా ఈ ప్రేమ‌

మందు తాగితే వ‌చ్చే మైకం పోవ‌చ్చుగాని...మ‌మ‌కారంతో వ‌చ్చే మైకం ఎన్న‌టికీ  పోదంటారు కొంద‌రు. ఈ సామెత ఖ‌చ్చితంగా ప్రేమికుల‌కే వ‌ర్తిస్తుంది. అ ప్రేమ మైకంలో  మునిగి తేలుతున్నారు సినీ న‌టీన‌టులు.  అందులో త‌మ‌కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు హీరోయిన్ న‌య‌న‌తార - తమిళ యువ‌ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివన్. 
 
ప్రేమికుల రోజును ఆస్వాదించ‌డానికి యాత్ర‌కు సైతం వెళ్లారు ఈ ప్రేమ జంట‌. అయితే  విమానాశ్ర‌యంలో న‌య‌న్‌-విఘ్నేష్ తీయించుకున్న ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోలో ప్రేమికుడు కౌగిలిలో బంది అయింది  హీరోయిన్ న‌య‌న‌తార‌. దీన్ని చూసిన న‌య‌న్ అభిమానులు పెళ్లి పీట‌లెక్కుతోందంటూ కామెంట్లు సంధిస్తున్నారు.
 
ఇప్పటికే ద‌ర్శ‌కుడు  విఘ్నేష్ శివన్ న‌య‌న్‌ను తన ఇంట్లో వారికి ప‌రిచ‌యం చేసిన‌ట్లు.. వారు కూడా పెళ్లికి సిద్దం అన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. అందుకేనేమో వీళ్లు బ‌హిరంగంగా తిర‌గ‌డం మొద‌లు పెట్టారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.