మళ్ళి పెళ్ళికి రెడీ అయిన నయనతార

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nayanathara
Updated:  2018-09-20 06:23:29

మళ్ళి పెళ్ళికి రెడీ అయిన నయనతార

నయనతార అంటే లేడీ సూపర్ స్టార్ అంటూ పొంగిపోతుంటారు తమిళ తంబీలు. స్వతహాగా ఆమె తమిళనాడు కి చెందకపోయినా ఆమెని తమ పక్కింటి అమ్మాయే అని అక్కడివారంతా అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ మధ్య యువ దర్శకులు విగ్నేష్ శివన్ గతకొంత కాలంగా నయనతారతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి కాకుండానే ఈ ఇద్దరూ దాదాపు రెండేళ్ల నుండి సహజీవనం చేస్తున్నారట , ఫారిన్ టూర్ లకు వెళ్లినా , మరేదైనా ఫంక్షన్ లకు వెళ్లినా జంటగా వెళ్తున్నారు ఫోటోలకు ఫోజిస్తున్నారు కానీ ప్రేమ , గీమా గురించి మాత్రం అస్సలు మాట్లాడటం లేదట .తాజాగా విగ్నేష్ ని ఈ విషయం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారు అని అడగ్గా నా చేతిలో ఏముంది అంతా అమ్మగారి దయ అంటూ అంతా నాయాతర మీదకి నెట్టేశాడు.

అంటే ఈ వ్యవహారం నిజమే అని తేలిపోయింది. ఇన్నాళ్ళుగా నయనతారతో రొమాన్స్ చేస్తుంటే విగ్నేష్ శివన్ వాళ్ళ అమ్మ అనుమతి అవసరం లేదు కానీ పెళ్ళికి మాత్రం ఆమె అనుమతి కావాలని అంటున్నాడు అలాగే నయనతార కూడా ఈ విషయం మీద చెప్పాలట !

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.