నిర్మాత‌ల‌కి చుక్క‌లు చూపిస్తున్న న‌య‌న‌తార‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-09 17:20:00

నిర్మాత‌ల‌కి చుక్క‌లు చూపిస్తున్న న‌య‌న‌తార‌

ఇంతకు ముందు నయనతార అంటే మనకి కేవలం గ్లామర్ పాత్రలే గుర్తొచ్చేవి కాని ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం నటకీ ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తుంది నయనతార. అయితే నయనతార తన స్థాయికి తగ్గట్లుగా పారితోషికాన్నిపెంచుకుంటూ పోతుంది అనే చెప్పాలి.
 
ప్రస్తుతం నయనతార చేతిలో అరడజను పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో సగం లేడీ ఓరియంటెడ్ సినిమాలే కావడం విశేషం. ఇకపోతే ఇటివలే నయనతార మళ్ళి ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. దాంతో ఇదే అదునుగా భావించిన ఈమె తన పారితోషికం ను ఒక్కసారిగా పెంచేసిందట. ఈ సినిమా కోసం నయనతారకు పారితోషికంగా 5.5 కోట్లు ఇస్తున్నట్లు టాక్.
 
ఒకవేళ ఇదే నిజమైతే దక్షిణాదిలో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా నయనతార పేరే చరిత్రకి ఎక్కుతుంది. ఇదిలా ఉంటే నయనతార తెలుగులో మెగా స్టార్ చిరంజీవి సరసన "సై రా" సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి కూడా నయనతారకి భారీగానే డబ్బులు ముట్టినట్టు తెలుస్తున్నాయి. 
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.