ఇవే మీ పాప కు పెట్టగలవా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

manchu lakshmi
Updated:  2018-10-17 04:56:03

ఇవే మీ పాప కు పెట్టగలవా..?

మంచు లక్ష్మి ఈ మధ్యనే కుర్ కురే కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే. కానీ ఈమె ఇలా చేయడం కొంత మంది ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. ఇప్పటికే కుర్ కురే యాడ్ లో కనిపిస్తున్న మంచు లక్ష్మి ఇవాళ ఆ బ్రాండ్ గురించి ఒక ట్వీట్ చేసింది. నేను ఏమీ తెలియకుండా మాట్లాడను మరియు ఇతరులకు హాని కలిగించే వస్తువు ఏదైనా నేను ప్రమోట్ చేయను.

అందుకనే నేను స్వయంగా కుర్ కురే ఫ్యాక్టరీ కి వెళ్లి అక్కడి వారు వీటిని ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాను. కుర్ కురే లో ఎటువంటి కెమికల్స్ లేవు. ఇది తినటం వల్ల ఎలాంటి హాని ఉండదు. రూమర్లను కాదు కుర్ కురే ని షేర్ చేయండి అంటూ ట్వీట్ చేసింది మంచు లక్ష్మి. ఇక ఆమె పై ఫైర్ అవుతున్న నెటిజన్లు, కుర్ కురే బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో మధ్యాహ్నం భోజన పథకాల గురించి వాటి క్వాలిటీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు అంటూ నిలదీస్తున్నారు.

మరికొందరైతే మీకు ఒక పాప ఉంది ఆ పాపకి కుర్ కురే తినిపిస్తూ వీడియో తీసి అది షేర్ చేయగలరా అంటూ విరుచుకుపడుతున్నారు. నిజానికి యాక్టర్ లంటే సినిమాలే కాక బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా చేయటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొంత మొత్తాన్ని తీసుకుని ఇలా ప్రమోట్ చేస్తారు. కానీ అవి కొనటం కొనకపోవటం మన చేతుల్లోనే ఉంటుంది కదా, కేవలం వాళ్ళు ప్రమోట్ చేశారని మనం వారిపై నిందలు వేయటం సిల్లీ గా ఉంటుంది అంటూ మరికొందరు లక్ష్మీ కి సపోర్ట్ చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment