నన్ను ఆంటీ అన్న ఫీల్ అవ్వను.. అనసూయ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anasuya
Updated:  2018-10-24 05:53:41

నన్ను ఆంటీ అన్న ఫీల్ అవ్వను.. అనసూయ

అనసూయ, జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, కొన్ని సినిమాలలో కీలకపాత్ర పోషించిన భామ. అయితే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల తో ఆ మధ్య వార్తల్లో నిలిచింది అమ్మడు. అర్జున్ రెడ్డి సినిమా సమయం లో ఒకింత గట్టిగానే ఒక డైలాగ్ పై రియాక్ట్ అయ్యింది అనసూయ. అప్పటినుండి కొందరు ఆంటీ అని పిలవడం మొదలుపెట్టారు.

అలా పిలిచిన తరువాత ఒకసారి లైవ్ లో తనని ఆంటీ అని పిలిచినా పర్లేదని, తన పిల్లల స్నేహితులు తనని ఆంటీ అని పిలుస్తారని కాబట్టి, ఆంటీ అన్న ఫీల్ అయ్యేది ఏమి లేదని చెప్పింది అనసూయ. అయితే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న బట్టలేసుకొని ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో అప్లోడ్ చేసింది అనసూయ.

ఆ ఫోటో కింద ఆంటీలు ఎవరైనా ఇలాంటి బట్టలు వేస్కుంటారా అంటూ కామెంట్స్ చేస్తూ సరదా గా ఆటపట్టిస్తున్నారు నెటిజన్లు.. తన జీవితం అంతా ఇలా బీచ్ ను చూస్తూ గడిపేయగలను, అలా సముదాన్ని చూస్తూ పాటలు పాడుకుంటూ, డాన్స్ లు వేసుకుంటూ.. అని చెప్పుకొచ్చిన అనసూయ కాస్ట్యూమ్స్ హాట్ గా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు సోషల్ మీడియా లో జనాలు. అయితే అనసూయ ప్రస్తుతం సినిమాల్లో తీరిక లేకుండా బిజీగా ఉంది. త్వరలో కథనం అనే సినిమాలో కీలక పాత్ర తో ప్రేక్షకుల ముందుకు రానుంది అనసూయ.

షేర్ :