ఒక్క ఫోటో తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన అనుష్క

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anushka shetty
Updated:  2018-10-29 01:55:30

ఒక్క ఫోటో తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన అనుష్క

అనుష్క శెట్టి అలియాస్ స్వీటీ, మొన్నటి వరకు అగ్ర హీరోల సరసన రొమాన్స్ చేసి మంచి ఫామ్ లో ఉన్న అగ్ర నటీమణి. బాహుబలి లో దేవసేన గా ప్రపంచానికి తెలిసిన తార. ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సైజ్ జీరో,బాగమతి ద్వారా కూడా తనదైన ముద్ర వేసింది అనుష్క. అయితే ఈ మధ్యకాలంలో అనుష్క సినిమాలకి దూరంగా ఉంది.

ఈ దూరం వల్ల తనకి పెళ్లి కుదిరింది అని వందలాది వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ రీసెంట్ గా అనుష్క పెట్టిన ఫోటో ఒకటి చర్చనీయాంశంగా మారింది. ఆ ఫోటో ని చూసి నేటిజెన్లు ఏమనుకుంటున్నారు..? అసలు వాళ్ళు అనుకొనేలా ఆ ఫొటోలో ఏముందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాలసిందే.. అనుష్క పెట్టిన ఫోటోకి నో కాప్షన్ రిక్వైర్డ్ అని పెట్టింది... దానితో క్యాప్షన్ ఇచ్చే పని లో పడ్డారు నెటిజన్లు..

కొందరు పెళ్లి అయిపోయిందా అంటూ, మరికొందరు కాలి రెండవ వెలుకి రింగ్ తొడిగి ఉంది. సాధారణంగా మా తెలుగు వారు అయితే మెట్టెలు అంటారు.. అవి పెళ్లి అయ్యాక తొడుగుతారు. ఇక్కడ రింగ్ కి గ్రీన్ లీఫ్ ఉండడం తో రెడి టు మేరేజ్ అని అర్థం అని, స్వీటీ బర్త్ డే లోపే పెళ్లి కానుంది అని కామెంట్స్ పెడుతున్నారు.. మరి ఈ విషయం లో క్లారిటీ రావాలంటే స్వీటీ నోరు విప్పాల్సిందే

షేర్ :

Comments

0 Comment