సూర్య తండ్రి శివ కుమార్ తీరు పై సోషల్ మీడియాలో విమర్శలు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero surya with his father
Updated:  2018-10-31 12:42:34

సూర్య తండ్రి శివ కుమార్ తీరు పై సోషల్ మీడియాలో విమర్శలు

తమిళ్ నటుడు శివకుమార్ అంటే తెలుగు లో కొద్దిమందికే తెలుసు. కానీ అదే తమిళ్ స్టార్ హీరోలు సూర్య ,కార్తీ ల తండ్రి శివకుమార్ అంటే ఈజీ గా గుర్తిస్తారు. ఎందుకంటే సూర్య మరియు కార్తీ లకి తెలుగులో ఉన్న మార్కెట్ అలాంటిది. ఇక విషయానికి వస్తే శివకుమార్ తాజాగా ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన ఒక వ్యక్తి మొబైల్ ను లాక్కుని విసిరగొట్టిన శివకుమార్ తీరును తీవ్రంగా తప్పు బడుతున్నారు.
 
ఇష్టం లేకుంటే వద్దని చెప్తే సరిపోద్ది కదా,అభిమానంతో సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన వ్యక్తి నుండి మొబైల్ లాక్కుని మరి విసిరి గొట్టడం ఏంటంటూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా మదురైలో ఒక ప్రారంభోత్సవంకు శివ కుమార్ హాజరయ్యారు. ప్రారంభోత్సవం సమయంలో చాలా మంది సెల్ఫీలు తీసుకునేందుకు మీదకు ఎగబడ్డారు. దాంతో అసహనంతో శివకుమార్ ఒక మొబైల్ ను లాక్కొని విసిరి పడేయడం జరిగింది. తాను అలా చేయడంను శివ కుమార్ సమర్ధించుకుంటున్నాడు. సెల్ఫీల పేరుతో సెలబ్రెటీలను ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని అక్కడ 300 మంది ఉన్నారు, అందులో 25 మంది సెల్ఫీ అంటూ మీదకు వచ్చారు. దాంతో నాకు భద్రత కల్పించిన వారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే ఆ సమయంలో మొబైల్ విసిరేసినట్లు గా శివకుమార్ సంజాయిషీ ఇచ్చారు.
 
శివకుమా