అప్పుడే అంత రెచ్చిపోతుందా??

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-14 03:42:09

అప్పుడే అంత రెచ్చిపోతుందా??

సినిమా అంటే ఏ ఒక్క టెక్నిషియన్ మీద డిపెండ్ అయ్యి హిట్ అవ్వదు. అందరూ కలిసి సమిష్టి కృషి చేస్తేనే విజయం సొంతం అవుతుంది. సినిమా పరిశ్రమలో ఊహించని సక్సెస్ వరించినప్పుడు ఒకోసారి ఆనందం గర్వానికి దారి తీస్తుంది. మనవల్లే  సినిమా ఆడిందనే భ్రమలో ఉన్నంత కాలం అంతా మనమనుకున్నట్టే జరగాలనిపిస్తుంది. 
 
చాలా మంది కుర్ర హీరోలు కొత్తలో అలానే చేస్తుంటారు కూడా.ఇప్పటికే రెండు హిట్లు కొట్టిన ఓ కొత్త పాప కూడా ఇలానే బిహేవ్ చేస్తుందని వినికిడి. వందకోట్ల విజయంలో తనదే కీలక పాత్ర అనుకుని నిర్మాతల నెత్తిమీద ఎక్కి కూర్చుంటుందంటా. ఇప్పటికే పెటాకులైన పెళ్లి విషయంలో వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ తన ఖర్చులతో నిర్మాతలకు కునుకులేకుండా చేస్తుందంట. 
 
విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ షూట్ గ్యాప్ ఏదైనా కారణం వల్ల రెండు రోజుల కంటే ఎక్కువ వస్తే వెంటనే ఇంటికి వెళ్లిపోవడానికి ఈ బ్యూటీ మొగ్గు చూపిస్తోందట. వెళ్తే వెళ్ళింది వాటి తాలూకా విమాన ఖర్చులు నిర్మాతల మీద వేస్తుందంట. మొన్న ఒక సినిమా విషయంలో ఇదే జరిగిందంటూ ఒక నిర్మాత వాపోయాడు. మంచి అవకాశాలు వచ్చే టైం లో ఇలాంటి పనులు ఆ అవకాశాల్ని ఎగేరిస్కుపోయే ప్రమాదం ఉందని దర్శక నిర్మాతలు హెచ్చరిస్తున్నారు. ఎన్ని సక్సెస్ లు వచ్చినా విధేయంగా ఉండే హీరోయిన్లకు కొదవ లేని పరిశ్రమలో ఇలా ఒక్క బ్లాక్ బస్టర్ తోనే నెత్తికెక్కేస్తే ఎలా అంటున్నారు సినీ వర్గాలు.