తల్లి కాబోతున్న ప్రియమణి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine priyamani
Updated:  2018-07-30 02:28:16

తల్లి కాబోతున్న ప్రియమణి

"యమదొంగ" చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ప్రియమణి ఈ సినిమా తో నటిగా మంచి గుర్తింపు ని అందుకుంది. ఈ సినిమా హిట్ తరువాత కొన్నేళ్ళ పాటు తెలుగు లో మంచి అవకాశాలే అందుకొని హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ప్రియమణి.
 
కాని ఆ తరువాత ఫ్లాప్స్ రావడం మూలాన హీరోయిన్ గా కనుమరుగైపోయింది ప్రియమణి. ఇక కేవలం మలయాళం ఇండస్ట్రీ కే పరిమితం అయిపోయిన ప్రియమణి గత ఏడాది ముస్తఫా రాజ్ ని ప్రియమణి వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత తెలుగులో "ఢీ 10" డాన్స్ షో న్యాయనిర్ణేతల్లో ఒకరిగా చేశారు.
 
తాజా సమాచారం ప్రకారం నటి ప్రియమణి తల్లి కాబోతుంది అనే విషయం సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు తల్లి కాబోతోంది కాబట్టి షో నుండి తప్పుకుందని తెలుస్తోంది . అయితే అధికారికంగా ప్రియమణి తల్లి కాబోతోందని చెప్పాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రియమణి ఇక ఫ్యూచర్ లో కూడా హీరోయిన్ గా కొనసాగేల లేదు అని అర్ధం అవుతుంది. మరి ప్రియమణి సినిమాల్లో మళ్ళి తన సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.