కాబోయే భార్య ప్రియాంకకి ప్రేమతో నిక్ జోసస్...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

priyanka chopra and nick
Updated:  2018-10-25 11:16:04

కాబోయే భార్య ప్రియాంకకి ప్రేమతో నిక్ జోసస్...

ప్రియాంక చోప్రా ప్రేమ వ్యవహారం ఒక పెద్ద సంచలనమే రేపిందని చెప్పాలి, ఎందుకంటే తనకంటే వయసు లో పదేళ్లు చిన్నవాడ్ని ప్రేమించి, పెళ్లి చేసుకోబోతుంది ప్రియాంక. వయసులో చిన్న అయితేనే ప్రాణంగా ప్రేమించే వాడు దొరికినప్పుడు. ప్రియాంక చోప్రా-నిక్ జోసస్ ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిందే.

అయితే వాళ్ళ పెళ్లి ఈ డిసెంబర్ లో రాజస్థాన్ లోని జోధ్ పూర్ ఉమైద్ భావం లో జరగనుంది అని సమాచారం. ప్రేమించిన అమ్మాయే భార్యగా రావడం తో నిక్ ఆనందానికి అవధులు లేవట. తన కాబోయే భార్య కోసం ఒక ఖరీదైన బహుమతే ఇవ్వనున్నాడు నిక్. అయితే ఆ బహుమతి ఏంటంటే,లాస్స్ ఏంజిల్స్ లోని బెవర్లీ హిల్స్ ప్రాంగణంలో నిక్ జోనాస్ 6.5 మిలియన్ డాలర్లతో ఓ విల్లాను కొన్నాడు.  ఈ విల్లా లో స్విమ్మింగ్ ఫూల్, ఐదు పడకగదులు, అతిధి వింగ్ నాలుగు బాత్రూమ్స్ ఉన్నాయి.

అంతే కాకుండా విల్లా చుట్టూ ప్రియాంక కి ఇష్టమైన పూల మొక్కలతో నింపేసాడట ఈ ప్రేమికుడు. ఈ విల్లాలో స్పెషల్ అట్రాక్షన్ గాజుతో తయారు చేసిన గోడలు విల్లా అందాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఇంతకీ మనోడు ఇక్కడే ఈ విల్లా నిర్మించడానికి కారణం, ప్రియాంక కి నిక్ ఇక్కడే ప్రపోజ్ చేసాడట.

షేర్ :

Comments

0 Comment