సై రా లో నటించనున్న నిహారిక

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

niharika
Updated:  2018-07-27 04:45:39

సై రా లో నటించనున్న నిహారిక

మెగా స్టార్ చిరంజీవి "ఖైది నెంబర్ 150" తరువాత నటిస్తున్న సినిమా "సై రా నరసింహారెడ్డి". రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

అలాగే నయనతార, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి వంటి వారు కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక కూడా నటించనుందని తెలుస్తుంది. ఇప్పటికే నిహారిక కొన్ని సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి గారితో నటించే అవకాశం వస్తే ఏమాత్రం అవకాశం మిస్ చేసుకోను అని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పింది. కానీ ఊహించని విధంగా ఆమెకి "సై రా" లో అవకాశం దక్కింది. ఈ సినిమాలో నిహారిక ఒక గిరిజన యువతిగ నటించాబోతుంది అంట. త్వరలోనే నిహారిక కి సంభందించిన సీన్స్ ని తెరకేక్కిస్తారు అంట యూనిట్. ఇదిలా ఉంటే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.