జూలై 28 న నిహారిక వెడ్డింగ్.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

konidela niharika
Updated:  2018-07-11 12:15:22

జూలై 28 న నిహారిక వెడ్డింగ్.

నిహారిక కొణిదెల ఇంకా సుమంత్ అశ్విన్ జంటగా నటించిన సినిమా "హ్యాపీ వెడ్డింగ్". యువి క్రియేషన్స్ ఇంకా పాకెట్ సినిమా వారు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాతో లక్ష్మణ్ కరన్య అనే షార్ట్ ఫిలిం మేకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
 
ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క టిజర్ ఇంకా ట్రైలర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. పూర్తి స్థాయి పెళ్లి నేపధ్యం లో సాగనున్న ఈ సినిమాలో ఎమోషన్స్ ఇంకా కామెడీ కీలక అంశాలు అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాని ఈ నెల 28 న రిలీజ్ చేయాలి అని ప్రకటించారు నిర్మాతలు.
 
ఈ విషయాన్ని యువి క్రియేషన్స్ వారు తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించారు. శక్తి కాంత్ కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. భవాని ప్రసాద్ ఈ సినిమా కి మాటలు రాసాడు. మరి ఇన్ని రోజులుగా ఫ్లాప్ హీరో గా కొనసాగుతున్న సుమంత్ అశ్విన్ కి నిహారిక హిట్ ని తిసుకోవస్తుందో లేదో చూడాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.