నిఖిల్ దానిపై క‌న్నెశాడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-26 04:53:43

నిఖిల్ దానిపై క‌న్నెశాడు

యంగ్ హీరో నిఖిల్ వరుసగా కొత్తదనం తో కూడిన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని తన వైపు తిప్పుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే "కిరాక్ పార్టీ" అనే సినిమాని రిలీజ్ చేసిన నిఖిల్ ఇప్పుడు "ముద్ర" అనే సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఇటివలే నిఖిల్ సంభందించిన ఒక న్యూస్ బయటకి వచ్చింది. అదేంటంటే నిఖిల్ బాలీవుడ్ కి వెళ్తున్నాడు అని.

బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ నలుగురు యువ హీరోలతో ఓ సినిమా రూపొందిస్తుందట. ఈ నలుగురిలో ముగ్గురిని బాలీవుడ్ నుంచి మరొకరిని తెలుగు నుంచి తీసుకోవాలని భావించారట. దాంతో ఆ అవకాశం నిఖిల్ కు వచ్చిందని, నిఖిల్ ను ముంబైకి పిలిపించి కథ కూడా వినిపించారని సమాచారం. కాని నిఖిల్ మాత్రం ఇంకా సినిమా సైన్ చేయలేదు అని తెలుస్తుంది.

ఎందుకంటే నిఖిల్ కి తెలుగులో మాత్రమే సినిమాలు చేయడం ఇష్టం అందుకే ఇప్పటి వరకు తమిళ్ సినిమా అవకాశాలు వచ్చినా గాని దేనికి ఓకే చెప్పలేదు నిఖిల్. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.