భయపడుతున్న నితిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nithin
Updated:  2018-09-08 06:44:41

భయపడుతున్న నితిన్

“అ ఆ” తర్వాత సరిగ్గా ఒక్కహిట్టు కుడా లేకుండా కాలం వెళ్లదీస్తున్నాడు నితిన్. రీసెంట్ గా వచ్చిన “శ్రీనివాస కళ్యాణం” కుడా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడటం తో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి వెళ్ళాలంటేనే భయపడుతున్నాడు ఈ హీరో. కొంచెం ధైర్యం చేసి “ఛలో” తీసిన వెంకి కుడుముల చేతిలో పెట్టాడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్.
 
ఈ భయమంతా ఎందుకు అనుకుంటున్నారా..! దాదాపు 16 అట్టర్ ఫ్లాప్ ల తర్వాత కాని హిట్ పడలేదు నితిన్ కి. హిట్లు వస్తున్నాయ్ అనుకునే లోపే పరాజయాలు మళ్ళి పలకరించడం మొదలెట్టాయి. ఇప్పుడు వరుస పరాజయాలు మల్లి మొదలవుతాయా అన్న కంగారులో ఉన్నాడు ఈ హీరో.
 
ఇంకో పక్క వెంకి కుడుముల చాల కాన్ఫిడెంట్ గా చాల భిన్నమైన కథని తాయారు చేస్తున్నాడని వినికిడి. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో ఈసారి రావాలని ప్లాన్ చేస్కున్నాడని సమాచారం. నితిన్ తో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టించాలని గట్టిగానే ఫిక్స్ అయ్యదనుకుంటా..! నితిన్ కుడా పక్కనుండి తనకి ఎలాంటి కథ కావాలో సలహాలు సూచనలు ఇచ్చి కథని ప్రిపేర్ చేయిన్చుకున్తున్నాడు.
 
ఇప్పుడు నితిన్ ఈ సినిమా కోసం హీరొయిన్ వేటలో పడ్డాడు. సీతార ఎంటర్టైన్మెంట్స్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

షేర్ :