మరోసారి హన్సికని లైన్ లో పెట్టిన నితిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hansika and nithin
Updated:  2018-07-16 06:28:45

మరోసారి హన్సికని లైన్ లో పెట్టిన నితిన్

నితిన్ ప్రస్తుతం "శ్రీనివాస కళ్యాణం" అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. వేగ్నేశ సతీష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఆగష్టు 9 న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తరువాత నితిన్ "ఛలో" ఫేం అయిన వెంకీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

"భీష్మ" అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ని సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఎస్.నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా నటించడానికి హన్సికని సెలెక్ట్ చేసాడు అంట దర్శకడు. నితిన్ తో ఇదివరకు "సీత రాముల కళ్యాణం లంకలో" అనే సినిమాలో కలిసి నటించింది హన్సిక.

ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచినా గాని నితిన్ మల్లి హన్సికనే రిపీట్ చేస్తున్నాడు. హన్సికకి కూడా తెలుగు లో ప్రస్తుతం అవకాశాలు లేవు. మరి ఈ ఫ్లాప్ పెయిర్ మరో సారి జత కట్టి హిట్ అందుకుంటారో లేదో చూడాలి. ఇదిలా ఉంటె ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా ఆగష్టు మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.