లావైతే ఎంటటా..? - నిత్యామీనన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine nithya menon
Updated:  2018-09-11 11:35:39

లావైతే ఎంటటా..? - నిత్యామీనన్

నటనతో ఆకట్టునే వారికి చిత్రపరిశ్రమలో అవకాశాలకు ఎప్పుడూ కొదవ ఉండదు. ఆ విషయం ఇప్పటికే చాలా మంది సీనియర్ నటినటులు నిరూపించారు. ఈ జనరేషన్ లో కూడా అలాంటి వారు లేకపోలేదు. అనుష్క, నయనతార లాంటి వారితో పాటు ఏ పాత్రలో అయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేసే నిత్యామీనన్ కూడా ఈ లిస్ట్ లో ఖచ్చితంగా ఉంటుంది.
 
కాకపోతే కాయలు కాసే చెట్టుకే రాళ్లదెబ్బలు అన్నట్టు ఇప్పుడు నిత్యామీనన్ కి కూడా అవకాశాలు తగ్గుమొహం పట్టాయి. కావాలనే నటనకీ దూరంగా ఉందా? లేదా అవకాశాలు నిజంగా తగ్గయా? అనేది ఆమెకే తెలియాలి. తాజాగా ‘గీతగోవిందం’లో చిన్న అతిథి పాత్రలో కనిపించింది. కీలకమైన పాత్ర పోషించినప్పటికీి అది గెస్ట్ రోల్ కావడంతో పెద్దగా పేరు తేలేదు. అప్పటినుంచి ఆమెపై నెటిజన్లు ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు.
 
నిత్య బాగా బరువెక్కడం వల్ల అవకాశాలు సన్నగిల్లిపోయాయని తనని ఆడిపోసుకుంటున్నారు. దీని మీద నిత్య ఫైనల్ గా వివరణ ఇచ్చింది. ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో “నేను అలాంటివేమి పట్టించుకోను.నేను ఎప్పుడూ చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటాను.” అంతేకాకుండా ఈ పొట్టి, లావుల గురించి విమర్శించే వాళ్లను చూస్తే తనకు నవ్వొస్తుందని కూడా తెలిపింది. ఆ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నిత్యామీనన్ మళ్ళీ హిట్లు పట్టేలా కనిపిస్తోంది.

షేర్ :