నివేదా ఎంత ప‌ని చేశావు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-12 06:20:41

నివేదా ఎంత ప‌ని చేశావు

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో జెంటిల్ మెన్ చిత్రంతో అడుగు పెట్టారు న‌టి  నివేదా థామ‌స్... తొలి సినిమా ప‌రిచ‌యంతోనే త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు థామస్... ఆ త‌ర్వాత తెలుగులో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటూ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో టాప్ రోల్ లో కొన‌సాగుతున్నారు నివేదా... అయితే ఇప్ప‌టికే ఈ చెన్నై బ్యూటీ జై ల‌వ‌కుశ, నిన్ను కోరి వంటి స్టార్ హీరోల సినిమాల‌లో హీరోయిన్ గా న‌టించారు.
 
ఈ సినిమాలలో న‌టించిన త‌ర్వాత మ‌రే సినిమాల‌లో న‌టించ లేదు ఈ ముద్దుగుమ్మ‌... కాళీ ఉన్న స‌మ‌యంలో ఏం చేయాలో తోచ‌క చివ‌రికి ప్రాణాంత‌క‌ర విన్యాసాలను చేస్తోంది నివేదా థామ‌స్... ఈ విన్యాసాల‌ను కూడా మ‌నుషుల‌తో కాకుండా డిఫ‌రెంట్ స్టైల్ లో ఆలోచించి విష స‌ర్పాల‌తో  ఫీట్లు చెస్తోంది.
 
కొండ‌చిలువ‌తో ఆట‌లాడుకుంటూ దానిని మెడ‌లో వేసుకుని ఏ మాత్రం భ‌యం లేకుండా ఆట‌లాడుకుంటుంది.. ఈ ముద్దు గుమ్మ‌... అంతే  కాకుండా ఆ కొండ చిలువ‌ను మెడ‌లో వేసుకుని డిఫ‌రెంట్ యాంగిల్స్ - ఫోటోల‌ను తీసుకుని వాటిని నివేదా త‌న సోష‌ల్ మీడియా అకౌంట్లో  పోస్ట్ చేశారు... ఆమె చేసిన పోస్ట్ ల‌కు ఎంత ఇష్టంగా పట్టుకున్నావ్ ఓ  మై గాడ్  వామ్మో ఎంత ధైర్యంగా కొండచిలువను పట్టుకున్నావంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.