బ్ర‌హ్మాంనందం కొడుకును ఆదుకునేదెవ‌రు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

brahmanandam and raja goutham
Updated:  2018-08-14 03:14:04

బ్ర‌హ్మాంనందం కొడుకును ఆదుకునేదెవ‌రు

బ్రహ్మానందం...ఈ పేరు ఇండియన్ సినిమాలోనే ఒక రేంజ్ లో మారుమోగిపోయిన పేరు. ఎందుకంటే మన సౌత్ లో బ్రహ్మానందం కామెడీ కి నవ్వనివారు ఉండరు, కానీ అలాంటి ఒక స్టార్ కమెడియన్ కొడుకు మాత్రం ఇప్పటి వరకు కెరీర్ లో సక్సెస్ కాలేదు. "పల్లకిలో పెళ్లి కూతురు" అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజా గౌతం.
 
ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా అవి ఫ్లాప్స్ గా నిలిచాయి. కొన్నేళ్ళ క్రితం "బసంతి" అనే సినిమాతో ఫ్లాప్ ని మూటగట్టుకున్న ఈ హీరో ఇప్పుడు "మనో" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. "మధురం" అనే ఇండిపెండెంట్ సినిమా తీసిన ఫణింద్ర నరిశెట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.
 
ఇటివలే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సెప్టెంబర్ 7 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో అయిన గౌతం హిట్టు కొడతాడో లేదో చూడాలి. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని జనాలు అందరూ డబ్బులు పోగేసుకొని నిర్మించారు.

షేర్ :