ఎన్టీఆర్ బ‌యోపిక్ బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే....

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-05 05:50:55

ఎన్టీఆర్ బ‌యోపిక్ బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే....

ఇటు టాలీవుడ్ లో కాని అటు కోలీవుడ్ లో కాని కొంత‌ కాలంగా బయోపిక్ ల హ‌వా ఏ రేంజ్ లో కొన‌సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రంలేదు... ఈ  త‌ర‌హాలోనే ఎన్టీఆర్ బ‌యోపిక్ ను ఆధారంగా చేసుకుని చిత్రించ‌నున్నారు... ఈ సినిమాలో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా,  తేజ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్క‌నుంది..  ఈ సినిమాకి సంబంధించి సుమారు 72 పాత్ర‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది... మరో పక్క ఈ మూవీ లో ఇందిరా గాంధీ పాత్ర లో న‌టించేందుకు అత్తారింటికి దారేది ఫేమ్ నదియా లేదా విజయ శాంతిని తీసుకోవాలనే ఆలోచనలో  ఉన్నట్లు తెలుస్తోంది చిత్ర యూనిట్. 
 
ఎన్టీఆర్  బ‌యోపిక్  అతి త్వ‌ర‌లోనే తెర‌మీద‌కు తెచ్చెందుకు చిత్ర యూనిట్ అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది... ఇందుకు సంబంధించిన‌  ప్రీ ప్రొడ‌క్ష‌న్  ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది... ఈ మూవీకి సుమారు 60 కోట్లు బ‌డ్జెట్ ను కేటాయించార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాలో ఉన్న పాత్ర‌ల‌కు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతూ స్కెచ్ లు వేస్తోంది చిత్ర యూనిట్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.