ఎన్టీఆర్‌ బయోపిక్‌ కొత్త పోస్టర్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ntr biopic poster
Updated:  2018-03-27 12:55:50

ఎన్టీఆర్‌ బయోపిక్‌ కొత్త పోస్టర్‌

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం త‌న తండ్రి ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా ఒక‌ బయోపిక్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప‌నులు దాదాపుగా పూర్తి కావ‌డంతో ఈ సినిమాను మార్చి 29న ప్రారంభం చేయ‌టానికి  చిత్ర బృంధం రెడీ  అయింది.ఈ సినిమాను వారాహి చలనచిత్రం బ్యానర్‌తో కలిసి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం‍ వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే
 
ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన మోష‌న్ టీజ‌ర్‌ను సైతం విడుద‌లు చేసిన విష‌యం అంద‌రికి తెలుసు.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో సినిమాలో ఏఏ పాత్ర‌ల‌ను చూపించబోతున్నారన్న విషయాన్ని స్ప‌ష్టంగా రూపొందించారు. ఎన్టీఆర్ చిన్న నాటి విషయాలు గుర్తుగా ఎన్టీఆర్ సొంత ఊరిలోని ఇంటితో పాటు, వెండితెరపై ఎన్టీఆర్ పోషించిన అ‍ద్భుతమైన‌ పాత్రలను అదే విధంగా రాజకీయరంగ‌ ప్రవేశం సందర్భంగా ఎన్టీఆర్ ఉపయోగించిన ప్రచార రథంతో పాటు పార్టీ జెండా కూడా ఉండేలా ఈ పోస్టర్‌ను డిజైన్‌ చేశారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.