వెంక‌య్య క్లాప్ తో ఎన్టీఆర్ సినిమా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ntr biopic
Updated:  2018-03-29 15:24:51

వెంక‌య్య క్లాప్ తో ఎన్టీఆర్ సినిమా

గ‌త కొద్దికాలంగా సంచ‌ల‌నం రేపుతున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమా ఎట్ట‌కేల‌కు రెగ్యూల‌ర్ షూటింగ్  మూహూర్తానికి టెంకాయ కొట్టారు చిత్ర యూనిట్... తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో త‌న తండ్రి పాత్ర‌లో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తున్నారు... అయితే ఈ రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభోత్స‌వానికి ఉప రాష్ట్ర‌ప‌తి వెంయ్య‌నాయుడు పాల్గోన్నారు...ఆయన బాలకృష్ణపై క్లాప్‌ కొట్టి షూటింగ్‌  ప్రారంభించారు.
 
ఈ సంద‌ర్భంగా ఉప రాష్ట్ర‌ప‌తి మాట్లాడుతూ... తెలుగుదనానికి, అలాగే తెలుగు ప్ర‌జ‌లు ప్రతిరూపం ఎన్టీఆర్‌ అని ఆయ‌న మ‌న మ‌ధ్య‌లేకున్నా ఆయ‌న ఆత్మ మ‌న‌మ‌ధ్య‌నే తిరుగుతుంద‌ని అన్నారు... ఆయ‌న చ‌రిత్ర సినిమాగా రావ‌డం ఎంతో శుభ‌ప‌రిణామం అని ఆయ‌న అన్నారు.రామారావు అభిమాని కానివారు సినీరంగంలో లేరంటే అతిశయోక్తి కాదు.
 
ఎన్టీఆర్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన లవకుశ, పాతాళభైరవి, దేశోద్ధారకుడు చిత్రాలు మార్చి 29నే  రిలీజ్‌ అయ్యాయి. అదేరోజు ప్రారంభమవుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం విజయం సాధించాలి. ఆయన జీవిత చరిత్ర నవతరాలకు తెలియాలి. ఓ మహానుబావుడి చరిత్రను రాయడం, సినిమాగా తీయడం చాలా అవసరం. ఈ ప్రయత్నాన్ని బాలకృష్ణ చేపట్టడం అభినందనీయం అని ఆయ‌న అన్నారు..
 
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే మనకు ఎన్టీఆరే గుర్తువ‌స్తారు. .. తండ్రి సినిమాలో కుమారుడు న‌టించ‌డం ఆయ‌న పాత్ర పోషించ‌డం బాల‌య్య‌కు ద‌క్కిన గౌర‌వం అని ఆయ‌న అన్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.