మళ్ళి బుల్లితెరపై వస్తున్న జూనియర్ ఎన్టీఆర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-09 14:52:23

మళ్ళి బుల్లితెరపై వస్తున్న జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది "బిగ్ బాస్" ద్వారా బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ వల్ల "బిగ్ బాస్" కె అందం వచ్చింది అని చాలా మంది అన్నారు. అయితే మళ్ళి ఇప్పుడు దాదాపు ఏడాది తరువాత బుల్లితెరపై సందడి చేయనున్నాడు ఎన్టీఆర్.

స్టార్ యాంకర్ అయిన ప్రదీప్ మాచిరాజు నిర్వహిస్తున్న "డీ 10" షో కి చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ పై షూట్ చేసిన ఈ ఎపిసోడ్ జూలై 11 నుంచి జూలై 18 వరకు టెలికాస్ట్ కానున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఏ రేంజ్ లో డాన్స్ చేస్తాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అందుకే ఎన్టీఆర్ తప్ప ఈ డాన్స్ షో కి ఎవ్వరు చీఫ్ గెస్ట్ గా సెట్ అవ్వరు అని గెస్ చేసి ఎన్టీఆర్ ని మాత్రమే పిలిచారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో ఇంకా ఎపిసోడ్స్ నందమూరి అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేసాయి. ఇదిలా ఉంటే ఈ స్టేజి మీద ఎన్టీఆర్ ఒక్క స్టెప్ అయిన వేస్తాడో లేదో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.