కొరటాల శివకి రెండో అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr and koratala shiva
Updated:  2018-08-01 04:33:34

కొరటాల శివకి రెండో అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ ?

"జనత గ్యారేజ్"....ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే వన్ అఫ్ ది బెస్ట్ ఫిలిం గా నిలిచింది. కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు, అయితే ఈ సినిమా కంటే ముందు నుంచి కూడా కొరటాల శివకి ఇంకా ఎన్టీఆర్ కి మధ్యలో మంచి అనుభందం ఉంది. కొరటాల రచయితగా కష్టాలు పడుతున్నపుడు ఎన్టీఆర్ కొరటాల ని ఆదుకున్నాడు.

తను హీరోగా నటించిన "బృందావనం" సినిమా తో పాటు వేరే ప్రాజెక్టుల్లోనూ కొరటాల శివకి అవకాశం ఇప్పించాడు ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ అంటే అంత అభిమానం కొరటాల శివకి. ఇప్పుడు "భరత్ అనే నేను" తో హిట్ అందుకున్న కొరటాల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగా స్టార్ చిరంజీవితో చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో బిజీ గా వున్నారు.

ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ తో ఒక మల్టీ స్టారర్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తాడు అంట ఎన్టీఆర్. కొరటాల శివ కూడా చిరంజీవి తో సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడు అని టాక్. మరి ఈ సారి ఏ రేంజ్ కమర్షియల్ కథలో ఎన్టీఆర్ ని చూపిస్తాడో కొరటాల శివ.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.