ఎన్టీఆర్ కు ఇదేం టైటిల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ntr image
Updated:  2018-03-03 11:40:18

ఎన్టీఆర్ కు ఇదేం టైటిల్

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోలు త‌మ సినిమాల ఎంపిక‌లో  ఆచితూచి అడుగు వేస్తుంటారు... అలా ఆచితూచి అడుగు వేసే వారిలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు... తాను న‌టించే సినిమాల్లో త‌న అభిమానులు మెప్పించ ద‌గ్గ విధంగా న‌టిస్తుంటారు యంగ్ టైగ‌ర్.. అయితే ఎన్టీఆర్ న‌టించిన లాస్ట్ చిత్రం జై ల‌వ‌కుశ, ఈ సినిమా బాక్సాఫీస్ ముందు నంద‌మూరి అభిమానుల‌ను పెద్ద‌గా ఆకట్టుకోలేక పోయింది... దీంతో యంగ్ టైగ‌ర్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. 
 
ఎన్టీఆర్  త‌దుప‌రి చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు... ఈ సినిమాకు సంబంధించి సుమారు మూడు నెల‌ల క్రిత‌మే షూటింగ్ ప్రారంభించినా ఇంత వ‌ర‌కూ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌లేదు చిత్ర యూనిట్ ... దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరాశ చెందిన‌ట్లే అనిపిస్తోంది... దీనికి ముఖ్య‌కార‌ణం ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ అనే తెలుస్తోంది.
 
ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి రాక ముందు అజ్ఞాత‌వాసి సినిమాను తెర‌కెక్కించారు త్రివిక్ర‌మ్... ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా అనూ ఇమాన్యుల్, కీర్తి సురేష్ స‌ర‌స‌న న‌టించారు...ఈ సినిమా చిత్ర యూనిట్ ఊహించ‌నంతగా బాక్సాఫీస్ ముందు ఆక‌ట్టుకోలేక పోవ‌డంతో దర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తీవ్ర మ‌న‌స్తాపానికి లోన‌య్యారు... అజ్ఞాత‌వాసి ప్లాఫ్ కావ‌డంతో నెక్ట్స్ త‌న త‌దుప‌రి చిత్రం ప్లాఫ్ కాకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది...అయితే ఈ క్ర‌మంలో త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే ఎన్టీఆర్ ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేశార‌ట... ఆ సినిమాకు సంబంధించి నాలుగు టైటిల్స్ ను అనుకున్న‌ట్లు తెలుస్తోంది.
 
తాజా స‌మాచారం ప్ర‌కారం ఆన్ సైలెంట్ మోడ్ అనే టైటిల్ తెర‌పైకి వ‌చ్చింది.... ఈ టైటిల్ ను రిజిస్ట్రేష‌న్ కూడా చేయించింద‌ట చిత్ర యూనిట్... అయితే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ టైటిల్ పై పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది... యాక్ష‌న్ హీరోకు ఇలాంటి టైటిల్ ను పెట్టారేంటి అని మ‌రోవైపు నందమూరి అభిమానులు చ‌ర్చింకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.