సౌత్ కొరియా లో దుమ్ము దులపడానికి రెడీ అయిన జూనియర్ ఎన్టీఆర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr
Updated:  2018-07-21 05:59:33

సౌత్ కొరియా లో దుమ్ము దులపడానికి రెడీ అయిన జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది "జై లవ కుశ" అనే సినిమాతో కమర్షియల్ హిట్ ని అందుకున్నాడు. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించాడు. అయితే ఈ సినిమా లో ఎన్టీఆర్ నటనకి ఈ సినిమా బిఐ ఎఫ్ ఎఫ్ ఎఫ్బుషియన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అయ్యింది.
 
ఇక ఈ సినిమా సౌత్ కొరియా లో రెండు రోజుల పాటు థియేటర్ లో ఆడబోతుంది. తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్ సినిమా సెలెక్ట్ అవ్వడం విశేషం. మరి తెలుగు లో తన నటన కౌశల్యాన్ని ప్రదర్శించిన ఎన్టీఆర్ ఇప్పుడు సౌత్ కొరియా లో తన నటనతో దుమ్ము రేపనున్నాడు.
 
ఇదిలా ఉంటె ఎన్టీఆర్ ప్రస్తుతం "అరవింద సామెత వీర రాఘవ" సినిమాతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ పూర్తిగా తన లుక్ ని చేంజ్ చేసాడు అని ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే అర్ధం అవుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.