బిగ్ బాస్ హౌస్ నుంచి మళ్ళి వెళ్ళిపోయిన నూతన్ నాయుడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

big boss 2
Updated:  2018-08-18 11:53:05

బిగ్ బాస్ హౌస్ నుంచి మళ్ళి వెళ్ళిపోయిన నూతన్ నాయుడు

బిగ్ బాస్ హౌస్ నెలలు గడిచిన కొద్ది మంచి రసవత్తరంగా సాగుతుంది. కొన్ని వారాల క్రితమే ఎలిమేనేట్ అయిన నూతన్ నాయుడు మళ్ళి ప్రేక్షకుల ఆదరణతో మళ్ళి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కౌశల్ ఇంకా రోల్ రైడా కి ఇచ్చాడు. వీళ్ళిద్దరూ ఎవరికీ వారు ఒక పిరమిడ్ కట్టాలి అనమాట.

ఆ పిరమిడ్ ని మిగతా హౌస్ మేట్స్ బాల్స్ తో కొడతారు. అయితే ఇక్కడ నూతన్ నాయుడు కి కౌశల్ కెప్టెన్ అవ్వడం ఇష్టం, అలాగే హౌస్ లో ఉండే అందరు అమ్మాయిలు కూడా కౌశల్ ని సపోర్ట్ చేస్తూ టాస్క్ ఆడారు. అయితే ఈ క్రమంలో నూతన్ నాయుడు షోల్డర్ కి గాయమైంది. అయితే వెంటనే బిగ్ బూస్ టీం నూతన్ నాయుడు ని కన్ఫెషన్ రూమ్ లోకి పంపించి డాక్టర్స్ ని పంపించి ఫస్ట్ ఎయిడ్ ఇప్పించారు.

నూతన్ నాయుడు పరిస్థితిని గమనించిన డాక్టర్స్ నూతన్ నాయుడుని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వెళ్లి చికిత్స తీసుకోవాలి అని కోరారు. మరి మళ్ళి నూతన్ నాయుడు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.