ఎలిమినేట్ అయ్యాక కౌశల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నూతన్ నాయుడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

koushal and nutan naidu
Updated:  2018-09-04 11:34:12

ఎలిమినేట్ అయ్యాక కౌశల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నూతన్ నాయుడు

ఇటీవల కాలంలో బిగ్ బాస్ ద్వారా అభిమానులను సంపాదించుకున్న వారిలో మొదటివాడు నూతన నాయుడు. కుటుంబం గురించి మాట్లాడకు నువ్వు అంటూ ఊగిపోయిన విధానం తెలుగు ప్రేక్షకులకి మరీ ముఖ్యంగా యువతకి ఆకట్టుకుంది.

బిగ్ బాస్ లో స్నేహం కుదరదని ఒకవేళ కుదిరినా ఏదొక సందర్భంలో ఆ స్నేహాన్ని త్యాగం చెయ్యక తప్పదని చెప్పుకొచ్చాడు. కౌశల్ ఇందుకు భిన్నంగా అందరితోను మంచిగా మెలగాలని ప్రయత్నించడం వల్ల అందరికి నచ్చుతున్నాడని, అది ఇంటి సభ్యులకు నచ్చడం లేదని పేర్కొన్నాడు. అతను మొదటినుంచి ఒకేలా ఉన్నాడని, మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే పోయారని అతణ్ణి దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారంతా ఇంటిబాట పట్టరాని ఆయన సూచించారు.

ఇంట గెలిచి రచ్చ గెలవడం మాములే కానీ బిగ్ బాస్ లో ఇంట గెలవకపోయిన పరవాలేదు కానీ రచ్చ మాత్రం కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. సరిగ్గా కౌశల్ కూడా అదే పని చేస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు ఈయన. నిజానికి ఇంట్లో ఉన్న వారెవ్వరికి కౌశల్ గురించి తెలియదు అతను టైటిల్ కొట్టేస్తాడనే భయం తోనే అతని మీద కాలుదువ్వుతున్నారని చెప్పాడు. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.