ఈసారి బాలయ్య కాలు వాడాడు...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

balakrishna
Updated:  2018-10-02 12:29:21

ఈసారి బాలయ్య కాలు వాడాడు...

సాధారణంగా సెలెబ్రిటీ హోదా ఉన్న వ్యక్తి జనం మధ్యలోకి వస్తే, జనం ఎగబడడం ఖాయం, అందులో హీరో అయితే, ఆ హీరోకి ఊపిరి కూడా అందనంత మీద పడతారు.. బాలయ్య విషయం లో అయితే ఆ సంగతే వేరు..ఇక విషయానికి వస్తే ... ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి కి తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేయడానికి వచ్చిన నందమూరి అందగాడు బాలకృష్ణ కి ఘనస్వాగతం పలికారు బాలయ్య అభిమానులు , తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇక బాలయ్య ని చూడటానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు..
 
అలా వచ్చిన వాళ్ళు బాలయ్య కార్ కి అడ్డంగా ఉండడం తో కార్ ముందుకి వెళ్ళడానికి ఇబ్బంది వచ్చింది, దీనితో బాలయ్య కోపం కట్టలు తెంచుకుంది,  వాహనం దిగి లాలూ , రమేష్ , కృష్ణయ్య అనే ముగ్గుర్ని కాలితో తన్నాడు బాలయ్య. చుట్టూ జనాలు అందరూ చూస్తుండగా తన్నడం తో  షాక్ అయ్యారు. ఇక దెబ్బలు తిన్న వాళ్ళ మనసు గాయపడింది..అందుకే పట్టరాని ఆవేశంతో బాలయ్య ఫ్లెక్సీలను కాల్చేశారు.. బాలయ్య తమకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని పట్టు పడుతున్నారు..
 
అయిన బాలయ్య అభిమానుల మీద చెయ్యి చేస్కోవడం ఇదేం కొత్త కాదు.. పైగా నేను కొడితే అభిమానులు సంతోష పడతారు అని బాలయ్య స్వయంగా ఇంటర్వ్యూ లో చెప్పుకున్నాడు....ఏదేమైనా వాళ్ళు ఈయన దగ్గర కి రావడం మానరు.. అదుపు తప్పితే బాలయ్య కంట్రోల్ తప్పడం మానడు.. షరా మాములే..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.