ఆస్కార్ విజేతలు వీరే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

oskar award winner
Updated:  2018-03-05 01:47:40

ఆస్కార్ విజేతలు వీరే

ఆస్కార్ పండుగ అట్ట‌హాసంగా జ‌రిగింది లాస్ ఏంజెల్స్ లో అతిపెద్ద అంత‌ర్జాతీయ అవార్డుల కార్య‌క్ర‌మం ఆస్కార్ వేడుక అట్ట‌హాసంగా జ‌రిగింది.....లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు....ఈ వేడుక‌కు హాలీవుడ్ లోని ప్ర‌ముఖ నటీ న‌టులు టెక్నీషియ‌న్లు హాజ‌ర‌య్యారు...ఆస్కార్ ఆవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్రముఖ అమెరికన్‌ టెలివిజన్‌ హోస్ట్‌ జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా  వ్య‌వ‌హ‌రించారు.
ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డులను గెలుచుకున్నవారి జాబితా ఇదే
 
ఉత్తమ చిత్రం: ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌
ఉత్తమ దర్శకుడు: గల్లీర్మో డెల్‌ టోరో (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌)
ఉత్తమ నటి: ఫ్రాన్సిస్‌ మెక్‌డోర్మండ్‌ (త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌ సైట్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ)
ఉత్తమ నటుడు: గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌ (డార్కెస్ట్‌ అవర్‌)
ఉత్తమ సహాయ నటి: అల్లీసన్‌ జెన్నీ (ఐ, టోన్యా)
ఉత్తమ సహాయ నటుడు: సామ్‌ రాక్‌వెల్‌ (త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ)
ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం: కోకో
ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం : డియర్‌ బాస్కెట్‌బాల్‌
ఉత్తమ సినీమాటోగ్రఫీ చిత్రం: బ్లేడ్‌ రన్నర్‌ 2049
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మార్క్‌ బ్రిడ్జెస్‌ (ఫాంటమ్‌ థ్రెడ్‌)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: ఇకారస్‌
ఉత్తమ లఘు చిత్రం: హెవెన్‌ ఈజ్‌ ఎ ట్రాఫిక్‌ జామ్‌ ఆన్‌ ది 405
ఉత్తమ ఎడిటర్‌: లీ స్మిత్‌ (డన్‌కర్క్)
ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ‌: కజుహిరో సుజి, డేవిడ్‌ మాలినోవ్‌స్కీ, లైసీ సిబ్బెక్‌ (డార్కెస్ట్‌ అవర్‌)
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌: మార్క్‌ వీన్‌గార్టెన్‌, గ్రెగ్‌ ల్యాన్‌డార్కర్‌, గ్యారీ ఎ.రిజ్జో (డన్‌కర్క్‌)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: పాల్‌ డెన్‌హామ్‌, ఆస్టర్‌బెర్రీ (ది షేప్‌ ఆఫ్‌ వాటర్)
ఉత్తమ విదేశీ చిత్రం: ఎ ఫెంటాస్టిక్‌ ఉమెన్‌ (చిలీ)
ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం : డియర్‌ బాస్కెట్‌బాల్‌
బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌: జాన్‌ నీల్సన్‌, గెర్డ్‌ నెఫ్జర్‌, పాల్‌ లాంబర్ట్‌, రిచర్డ్‌ ఆర్‌. హూవర్‌(బ్లేడ్‌ రన్నర్‌ 2049)
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం: ది సైలెంట్‌ చైల్డ్‌
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: జేమ్స్‌ ఐవరీ (కాల్‌ మి బై యువర్‌ నేమ్‌)
బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: జోర్డన్‌ పీలే (గెటౌట్‌)
బెస్ట్‌ ఒరిజినల్‌ పాట: రిమెంబర్‌ మీ(కోకో)
 
నామినేట్ అయిన ఎనిమిది చిత్రాల్లో పోటీ ప‌డి చివ‌ర‌కు ఉత్తమ చిత్రం ది షేప్‌ ఆఫ్‌ వాటర్ నిలిచింది.... 2017లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు గులెర్మో డెల్‌ టోరో అమెరికన్‌ ఫాంటసీ డ్రామా చిత్రంగా తెరకెక్కించారు. సాల్లీ హాకిన్స్‌, మైఖెల్‌ షాన్నన్‌, రిచర్డ్‌ జెన్‌కిన్స్‌, డోగ్‌ జోన్స్‌, మైఖెల్‌ స్టుల్‌బార్గ్, ఆక్టేవియా స్పెన్సర్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ ప్రభుత్వ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఓ మూగ యువతి..ఇదే ల్యాబొరేటరీలో పరిశోధన నిమిత్తం ఉంచిన హ్యూమనాయిడ్‌ నీటి జంతువుతో ప్రేమలో పడుతుంది. 19.5 మిలియన్‌ డాలర్స్‌ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్‌ వద్ద 114.3 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
 
ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ అందుకున్న !! ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌!!  చిత్రానికి నాలుగు కేటగిరీల్లో అవార్డులు వరించాయి.
 
ఉత్తమ చిత్రం
ఉత్తమ దర్శకుడు
బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ 
 
డన్‌కర్క్  చిత్రానికి మూడు అవార్డులు
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌
బెస్ట్‌ ఫిలిం ఎడిటింగ్‌
బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.