డిసెంబర్ లో వస్తున్న “పడి పడి లేచె మనసు”

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-26 01:51:20

డిసెంబర్ లో వస్తున్న “పడి పడి లేచె మనసు”

శర్వానంద్, సాయి పల్లవి హీరో-హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం “పడి పడి లేచె మనసు”.ఇటీవలే కోల్ కత్తా లో షూటింగ్ జరుపుకొని వచ్చిన ఈ చిత్రం ఇటీవలే కోల్ కత్తా లో షూటింగ్ జరుపుకొని వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే 70% పూర్తయినట్లు సమాచారం.
 
త్వరలోనే నేపాల్ లో మరికొంత భాగాన్ని చిత్రీకరణ జరిపి ఫైనల్ పార్ట్ ని హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చితం డిసెంబర్ 21 న విడుదల అవుతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  ఈ సినిమాకి "కృష్ణ గాడి వీర ప్రేమ గాథ" ఫేమ్ అయినా విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నాడు. 
 
ఈ చిత్రంలో సాయి పల్లవి బెంగాలీ భామగా నటిస్తుండగా శర్వానంద్ హైదరాబాద్ యువకుడిగా కనిపించనున్నాడు, ఇక ఈ చిత్ర హక్కులను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు 18కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రతిష్టాత్మక చిత్రం “ఎన్టీఆర్” లో కూడా శర్వానంద్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే శర్వానంద్ చేసే పాత్రపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.