టైట్ డ్ర‌స్ లో ప‌రిణితి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

parineeti chopra bollywood heroine
Updated:  2018-08-25 11:11:32

టైట్ డ్ర‌స్ లో ప‌రిణితి

ఈ న‌వీన యుగంలో ఇటు బాలీవుడ్ లోనూ అటు టాలీవుడ్ ను ఒక చిన్న పాటి త‌ప్పు క‌నిపిస్తే చాలు దానిని స్క్రీన్ షాట్ తీసి నెటిజ‌న్లు ట్రోల్స్, గాసిప్స్ లు పేల్చ‌డం కొత్తేమి కాదు. గ‌తంలో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లకు చెందిన బ‌డా హీరోయిన్లు సైతం నెటిజ‌న్ల ట్రోల్ కు త‌ట్టుకోలేక‌పోయారు. అయితే ప్రస్తుతం ఇదే ప‌రిస్థితిని మ‌రో బాలీవుడ్ హీరోయిన్ నెటిజ‌న్ల కామెంట్స్ కు త‌ట్టుకోలేక పోయింది.
 
ఈ హీరోయిన్ ఎవ‌రో కాదు ప‌రిణితి చోప్రా. తాజాగా ఆమె హీరోయిన్ గా న‌టించిన చిత్రం న‌మ‌స్తే ఇంగ్లండ్ ఈ చిత్రంలో అర్జున్ క‌పూర్ తో జంట‌గా క‌లిసి న‌టించింది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా క‌పూర్ తో క‌లిసి వెళ్లిన‌ ఈ అందాల భామ చాలీ చాల‌నంత బ‌ట్ట‌లు ధ‌రించి, చూడ‌టానికి ఎబ్బెట్టుగానూ, అసౌక‌ర్యంగా ఒళ్లంతా క‌నిపించేలా టైట్ డ్రెస్సింగ్ స్టైల్ లుక్ లో క‌నిపించాల‌నుకుంది. 
 
ఇక చోప్రా స్టైల్ గా న‌డిచే స‌మ‌యంలో మ‌ధ్య మ‌ధ్య‌లో బిగిసిపోతున్న డ్ర‌స్సును ప‌దేప‌దే స‌ర్ధుకుంటూ అసౌక‌ర్యానికి గురి అయింది. ఇక దీన్ని గ‌మ‌నించిన నెటిజ‌న్లు ప‌రిణితిని టార్టెట్ చేసుకుని సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.