శ్రీకాంత్ అడ్డాల చేసిన తప్పును చెబుతున్న పరుచూరి...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

srikanth addala and paruchuri
Updated:  2018-10-10 01:54:47

శ్రీకాంత్ అడ్డాల చేసిన తప్పును చెబుతున్న పరుచూరి...

మొదట్లో కొన్ని హిట్ సినిమాలను మనకి అందించిన శ్రీకాంత్ అడ్డాల తరువాత వరుస ఫ్లాపులతో నలిగిపోయాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో హిట్ ఇచ్చడన్న నమ్మకంతో మహేష్ బాబు బ్రహ్మోత్సవం కోసం పీవీపీ లాంటి పెద్ద బ్యానర్ లో పిలిచి మరీ ఆఫర్ ఇస్తే, ఆ సినిమా కాస్తా మహేష్ కెరీర్ లోనే మాయని మచ్చ లా మారింది.
 
ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ, పరుచూరి ఇలా అన్నారు. సినిమా కోసం తొమ్మిది మంది రచయితలు పనిచేశారు. అందులో ఏ ఇద్దరు భావన, ఆలోచన కూడా ఒకే విధంగా ఉండదు. అలాంటప్పుడు చెప్ప దలుచుకున్న విషయం ప్రేక్షకులకు అసలు కనెక్ట్ అవ్వదు అని అన్నారు పరుచూరి.
 
సినిమా ఫ్లాప్ అయ్యాక ఒకరోజున శ్రీకాంత్ అడ్డాల మా అన్నయ్య వద్దకు వచ్చి, గొప్ప అవకాశం పోగొట్టుకున్నానని బాధ పడ్డాడట ఆయనలా బాధపడటంలో తప్పులేదు, ఎందుకంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం రావడం ఒక వరం. వచ్చినప్పుడు తొందరపడకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి హీరో సినిమా కోసం ఏడాది రెండేళ్ళు కష్టపడి నమ్మకంతో చేస్తారు. అలాంటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే సినిమా ఫ్లాపవుతుంది. ఇలాంటి ప్రయోగలలో అందరికి సాధ్యం కాదు అని విశ్లేషించారు పరుచూరి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.