పవన్ కళ్యాణ్ అజ్ఞాత ప్రేమకథ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan
Updated:  2018-09-03 03:09:00

పవన్ కళ్యాణ్ అజ్ఞాత ప్రేమకథ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టి నేటికి సరిగ్గా 47 ఏళ్ళు.ఆయన వైవాహిక జీవితం గురించి జరగని చర్చ లేదంటే అతిశయోక్తి కాదు. దానికి ఆయన కుండబద్దలు కొట్టినట్టు పలుమార్లు సమాధానం ఇచ్చేసాడు.టీనేజీ లో ఉన్నప్పుడు అబ్బాయిలకు అమ్మాయిలమీద అమ్మాయిలకు అబ్బాయిల మీద ఆకర్షణ సర్వసాధారణం. పవన్ కళ్యాణ్ కూడా తాను టీనేజీ లో ఉన్నప్పుడు ఈ ఆకర్షణకు గురయ్యాడని ఆయనే వివరించాడు.
 
ఆయన మద్రాసులో ఉన్నపుడు ఇంటర్లోనే చదువు ఆపేసి కంప్యూటర్ క్లాసులకు వెళ్లేవాడట. అదే క్లాసులకు ఒక అందమైన అమ్మాయి కూడా రావడంతో ఆ అమ్మాయికి పవన్ ఆకర్షితుడు అయ్యడంటా! వారిరివురికి స్నేహం కుదరడంతో పాటు క్లాసులు అయ్యేకొద్ది చనువుకుడా పెరిగిందంటా! దీనితో ఎలాగైనా సరే అమ్మాయికి విషయం చెప్పాలనుకుని ఒక పాడైపోయిన కార్ ని తీసుకుని అమ్మాయిని డ్రాప్ చెయ్యడానికి వెళ్లే మార్గంమధ్యం లో ఆపి అస్సలు విషయం ఇబ్బంది పడుతూనే చెప్పడంటా విషయం విన్న సదరు అమ్మాయి ఇవేం పనులు అయినా ఈ వయలు ప్రేమేవిటి..? అంటూ క్లాస్ ఇచ్చుకుంది.
 
ఆ సమయం లో అమ్మాయి కాస్తా టీచర్ లా కనబడింది మన పవన్ కి. పాపం ఈ విషయం చెప్తూ కూడా సిగ్గు పడ్డాడు పవన్. ఇంట్రోవెర్ట్ లాంటి పవన్ సాహసం చేసి ఒక అమ్మాయికి దగ్గర అవడమే విశేషం అలాంటిది ప్రపోసల్ వరకు తీసుకెళ్లాడు అంటే గొప్ప విషయమే. ఇప్పుడు ఆ అమ్మాయి గారు ఎక్కడ ఉన్నారో ఎం చేస్తున్నారో? ఖచ్చితంగా పవన్ కి ఇంత క్రేజ్ వస్తుందని తెలిసుంటే ఎగిరిగంతేసి మరి యెస్ చెప్పేసేదేమో! ఇప్పుడు తెలిసి కొంచెం అయిన బాధ పడుంటుంది లెండి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.