పవర్ స్టార్ సినిమా రీమేక్ చేస్తున్న విజయ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan
Updated:  2018-07-31 10:58:59

పవర్ స్టార్ సినిమా రీమేక్ చేస్తున్న విజయ్

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో "అత్తారింటికి దారేది" సినిమా ని ఎవ్వరు మర్చిపోలేరు, ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి క్రియేట్ చేసిన రికార్డ్స్ అలాంటివి. 2013 లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
 
అయితే ఈ మూవీ రిలీజ్ అయిన ఇన్నేళ్ళ తర్వాత ఈ సినిమాని తమిళ్ లో రీమేక్ చేయడానికి భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించే లైకా సంస్థ "అత్తారింటికి దారేది" తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేసారు.
 
రిలీజ్ కి ముందే సగం సినిమా నెట్ లో లీక్ అయిన కూడా కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మూలంగా ఈ సినిమా భారి కలెక్షన్స్ కొల్లగొట్టి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 100 కోట్ల దాక వసూలు చేసింది. అయితే ఈ తమిళ రీమేక్ లో స్టార్ హీరో విజయ్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.