ప‌వ‌న్ ఏమ‌న్నారంటే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan and sri reddy
Updated:  2018-04-14 06:23:49

ప‌వ‌న్ ఏమ‌న్నారంటే

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ పేరుతో అమాయ‌క మ‌హిళ‌ల‌పై లైంగిక వేంధిపులు జ‌రుగుతున్నాయంటూ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని కొద్ది రోజులుగా సంచ‌ల‌నాన్ని సృష్టిస్తోంది న‌టీ శ్రీ రెడ్డి..ఇండ‌స్ట్రీలో నిర్మాత‌లు మొద‌లుకుని చిన్న‌పాటి అసిస్టెంట్ వ‌ర‌కూ విచ్చ‌ల‌విడిగా అమ్మాయిల‌ను లైంగికంగా వేధిస్తున్నార‌ని తెలిపింది శ్రీ రెడ్డి..
 
అయితే ఇప్ప‌టికే ప్ర‌ముఖ నిర్మాత సురేష్ కుమారుడు, ద‌గ్గుబాటి రానా సోద‌రుడు... అభిరామ్ ద‌గ్గుపాటి  శ్రీరెడ్డితో చ‌నువుగా ఉన్న ఫోటోల‌ను, ఇత‌ను సినిమా అవ‌కాశాల‌పేరుతో త‌న‌ను ఎలా వంచించుకున్నాడో ప్ర‌తీ విష‌యాన్ని త‌న తెలియ‌చేసింది శ్రీ రెడ్డి.
 
ఇక తాజాగా ఇదే విష‌యంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు... ఇండస్ట్రీలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని, కోర్టుకు వెళ్లాలని... అప్పుడే వారికి పూర్తి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు... అన్యాయానికి గురైనవారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. టీవీలలో చర్చల వల్ల ఏమీ రాదని... కొన్ని రోజుల తర్వాత అందరూ మరిచి పోతారని, న్యాయం కూడా జరిగే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.