బాలక్రిష్ణ లాగ నేను కూడా భూతులు మాట్లాడాలా..? పవన్ కళ్యాణ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan and balkrishna
Updated:  2018-11-05 01:16:39

బాలక్రిష్ణ లాగ నేను కూడా భూతులు మాట్లాడాలా..? పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలక్రిష్ణ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. తెలుగుదేశం పార్టీ శ్రేణులను, బాలయ్య అభిమానులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసాడు పవన్ కళ్యాణ్. ధర్మపోరాట దీక్ష అని చేస్తూ ఆ వేదిక మీద బాలయ్య దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని తిట్టకూడని తిట్లు తిట్టిన విషయం అందరికి తెలిసిందే.

అయితే అప్పట్లో బాలయ్య తిట్లు సోషల్ మీడియాలో వైరల్ కాగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసారు అంతేకాదు బాలయ్య మీద దాడికి కూడా ప్రయత్నించారు కూడా.

అయితే పవన్ కళ్యాణ్ ఆ ఇన్సిడెంట్ ని గుర్తు చేస్తూ నేను కూడా మోడీ ని తిడితేనే స్పెషల్ స్టేటస్ కోసం పోరాడినట్లా, అంటే అప్పుడు నేను బాలయ్య లాగ అందరిని భూతులు తిట్టాలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. మరి పబ్లిక్ గా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బాలక్రిష్ణ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్ర లో పర్యటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

షేర్ :