ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న పవన్ కళ్యాణ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-10 13:45:47

ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే ఇంత క్రేజ్ పెట్టుకొని కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చెయ్యకుండా జనం కోసం జనసేన ని జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇలాంటి పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఒకానొక సమయం లో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు అట. జనసేన పార్టీ తరపున ప్రజాపోరాట యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ యాత్ర సంధర్బంగా ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో నాకు బిడియం ఎక్కువగా ఉండేది. సుస్వాగతం సినిమా షూటింగ్ లో నాపై ఒక పాటను చిత్రీకరించాలని అనుకున్నారు.

బస్సు పైకి ఎక్కి వేలాది మంది చూస్తుండగా నేను డాన్స్ చేయాలనీ చెప్పారు. నేను చాలా భయపడిపోయాను. ఏం చేయాలో తెలియక మా వదిన సురేఖకు ఫోన్ చేసి నేను సినిమాలో నటించడానికి సరిపోను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాను, కాని ఆ సమయం లో నేను చదివిన కొన్ని పుస్తకాలు నాలోని భయాన్ని పోగొట్టి నన్ను దృడంగా చేసాయి" అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.