ప‌వ‌న్ నెక్ట్స్ సినిమా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-06 04:06:41

ప‌వ‌న్ నెక్ట్స్ సినిమా

టాలీవుడ్ స్టార్ హీరో, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్  న‌టించిన 25 వ తాజా చిత్రం అజ్ఞాత‌వాసి.... ఈ సినిమాకు  మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు...  సంక్రాంతి పండుగ‌కు కానుక‌గా విడుద‌ల చేసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక పోయింది... దీంతో త‌మ అభిమాన  హీరో  ప‌వ‌న్ క‌ల్యాణ్ చివ‌రి సినిమా హిట్ కొట్ట‌క‌ పోవ‌డంతో అభిమానులకు నిరాశ చెందారు.
 
ఈ సినిమా తర్వాత పూర్తి స్థాయిలో రాజ‌కీయాలు చేస్తాన‌ని, ఇక నుంచి ఎలాంటి సినిమాలు చేయ‌న‌ని ప‌వ‌న్ చెప్పిన సంగ‌తి తెలిసిందే...  తాను ఇంత‌కాలం సినిమాలు  చేస్తాన‌ని అనుకోలేద‌ని అభిమానుల కోరిక మేర‌కే ఇంత‌వ‌ర‌కూ సినిమాల‌లో న‌టించాన‌ని చెప్పారు... అయితే అభిమానులు మాత్రం ఫుల్ టైమ్ రాజ‌కీయాలు చేస్తూ స‌మ‌యం ఉన్న‌ప్పుడు సినిమాలు చేస్తే చాలు అని కోరుకుంటున్నారు.
 
వారు కోరుకున్న‌ట్లుగానే ప‌వ‌న్ 26 వ సినిమా తెర‌కెక్కే  అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని టాలీవుడ్ స‌మాచారం...ఈ సినిమా కూడా ఎన్నిక‌లలోగా  పూర్తి చేయ‌వ‌చ్చనే ఉద్దేశ్యంతో ముగ్గురు బ‌డా నిర్మాత‌ల వ‌ద్ద ప‌వ‌న్ సుమారు 30 కోట్లు  అడ్వాన్స్ తీసుకున్నార‌ట‌... పవన్ సినిమాలు చేయని పక్షంలో ఆ మొత్తం వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది...  అందుకే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో  సినిమా చేయాలని పవన్ భావిస్తున్నట్టుగా  ప్రచారం జోరుగా సాగుతోంది... అయితే ఇటీవ‌లే  రీసెంట్ గా 'ఇంటిలిజెంట్' ఫంక్షన్ లోనూ  వినాయక్ మాట్లాడుతూ, సినిమాలను పవన్ పక్కన పెట్టెయ్యొద్దని, అవ‌కాశం ఇస్తే తాను సినిమా తీస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.