మెప్పించలేకపోయిన పెనివిటి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

aravinda sametha
Updated:  2018-10-12 05:17:25

మెప్పించలేకపోయిన పెనివిటి

కొన్ని సార్లు పాటలు వినడానికి అద్భుతంగా ఉంటాయి. వింటూనే ఉండాలి అనిపిస్తాయి. కానీ అదే పాట సినిమాలో వచ్చినప్పుడు విజువల్స్ పరంగా అంత ఆకట్టుకోలేకపోవచ్చు లేదా బలవంతంగా ఆ పాటను ఇరికించినట్టు అనిపించచ్చు. అలాంటప్పుడు వింటున్నపుడు కలిగే ఎమోషన్ మనకు ఆ వీడియో చూస్తున్నప్పుడు రాదు.
 
అరవింద సమేత సినిమా లోని పెనివిటి పాట విషయంలో కూడా అదే జరిగింది. థమన్ కంపోజ్ చేసిన ఆ పాట విడుదలైన నాలుగు పాటల్లో బెస్ట్ గా నిలిచింది. మనసును కరిగించే లిరిక్స్, అద్భుతమైన మ్యూజిక్ వల్ల పాట వింటూనే మైమరిచిపోయాం. కానీ ఈ సినిమాలో అంత ఏమి జరగలేదు. మ్యూజిక్ కి ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు, ఆ గిటార్, వెస్టర్న్ బ్యాక్ డ్రాప్ ఏమాత్రం ఆ పాట ఎమోషన్ ను ఎలివేట్ చేయలేకపోయాయి.
 
పాట కు కనిపించే వీడియో కి సంబంధమే లేదేమో అనేలా ఉంది ఆ పాట. పైగా కావాలని ఎన్టీఆర్ తో కొన్ని డైలాగులు చెప్పించేసి పాటను ఇరికించేసిన ఫీలింగ్ కలగడంతో పాటెలా ఉన్నా ప్లేస్ మెంట్ ఘోరంగా ఉంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక హిట్ అయిన ఆ పాట సినిమాలో మాత్రం ఫట్టయ్యింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.