సమంత రాజ‌కీయ అరంగేట్రం అక్క‌డి నుంచే పోటీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-01 03:07:34

సమంత రాజ‌కీయ అరంగేట్రం అక్క‌డి నుంచే పోటీ

 
తెలుగు స్టార్ హీరోయిన్ స‌మంత.... 2010 సంవ‌త్స‌రంలో ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు... ఆ త‌ర్వాత బృందాద‌నం, అత్తారింటికి దారేది,  రాజ‌మౌళి తెర‌కెక్కించిన  ఈగ వంటి చిత్రాల‌లో క‌థానాయిక‌గా న‌టించి  అగ్ర హీరోల‌తో హిట్లు అందుకుంది స‌మంత‌... అయితే ఈ నేప‌థ్యంలో కొద్ది రోజుల క్రితం హీరో నాగ చైత‌న్య ను పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటికి కోడ‌ల‌య్యారు. 
 
ఈ క్ర‌మంలో స‌మంత చైత‌న్య‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత క్ర‌మ క్ర‌మంగా సినిమాలలో న‌టించ‌డం త‌గ్గించి, సామాజిక సేవ‌లు చేస్తున్నారు.... ఇక తాజాగా స‌మంత గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది
 
త్వ‌ర‌లో స‌మంత‌ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌ని, రానున్న 2019 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ త‌రపున సికింద్రాబాద్ నియోజ‌క వ‌ర్గం నుంచి  పోటీ చేయ‌న‌న్నారని... ఇందుకోసం పార్టీ త‌రపున టికెట్ కూడా క‌న్ ఫామ్ చేశార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి... అయితే ఈ విష‌యంపై స‌మంత ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.