అసలు ప్రభాస్ పక్కన పూజ హేగ్దే సెట్ అవుతుందా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

young rebel star prabhas and pooja hedge
Updated:  2018-08-01 12:42:45

అసలు ప్రభాస్ పక్కన పూజ హేగ్దే సెట్ అవుతుందా ?

యంగ్‌ రెబెల్ స్టార్ అయిన ప్రభాస్ పక్కన హీరోయిన్ గా సెట్ అవ్వాలి అంటే ఆ రేంజ్ హైట్ తో పాటు పర్సనాలిటీ కూడా ఉండాలి, ఇప్పటి వరకు ప్రభాస్ కి త్రిష ఇంకా అనుష్క మాత్రమే పర్ఫెక్ట్ జోడి అనిపించుకున్నారు.
 
అందుకే జాగ్రత్తలు తీసుకొని మరీ హీరోయిన్ లను సెలెక్ట్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. కానీ పెద్దగా ఆలోచించకుండానే ప్రభాస్ "జిల్" ఫేమ్ రాధాకృష్ణ ల కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఎంపిక చేసారు కట్ చేస్తే ఇక సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది అని అనుకుంటున్న సమయంలో పూజా హెగ్డే ప్రభాస్ ల జంట బాగుంటుందా, అసలు తను సెట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు అందరి ప్రశ్న.
 
ఎందుకంటే పూజ హెగ్డే మరి సన్నగా ఉంటుంది అలాంటప్పుడు ఈ భామ ప్రభాస్ పక్కన నటిస్తే సీన్స్ పండుతాయో లేవో అనే అనుమానం మూవీ యూనిట్ కి వచ్చింది. అందుకే ప్రొడ్యూసర్స్ ఈ భామకి ప్రభాస్ తో ఫోటో షూట్ ఏర్పాటు చేసారు అంట అందుకు పూజ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం "సాహో" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.