అలా చేయ‌డం నాకు న‌చ్చ‌దు కానీ చేయాలి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine pooja hegde
Updated:  2018-06-16 03:12:32

అలా చేయ‌డం నాకు న‌చ్చ‌దు కానీ చేయాలి

2014లో వ‌రుణ్ తేజ్  హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ముకుంద‌.  ఈ చిత్రంలో వ‌రున్ కు స‌ర‌స‌న బాలీవుడ్ భామ పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాలో పూజా హీరోయిన్ పాత్ర‌కు ద‌ర్శ‌కుడు అనుకున్న రీతిలో న‌టించ‌డ‌టంతో ముకుంద సినిమా సూప‌ర్ హిట్ అయింది. ఇక ఈ చిత్రం త‌ర్వాత పూజాకు వ‌రుస అవ‌కావాలు వ‌స్తునే ఉన్నాయి. అయితే ఇప్ప‌టికే నాగ చైత‌న్య హీరోగా న‌టించిన చిత్రం ఒక‌లైలా కోసం, అలాగే అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో సినిమాలో నటించింది.
 
అయితే ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ‌కు తెలుగులోనే కాకుండా అన్ని భాష‌ల్లోను అవ‌కాశాలు వ‌స్తున్నాయి. తాజాగా పూజా ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చంది. ఈ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ జీవితంలో అన్నిప‌నులు మ‌న‌కు న‌చ్చ‌వు కానీ చేయాలి. అది మ‌న‌కు ఇష్టం ఉండ‌క‌పోవ‌చ్చు కానీ చెయ్యాలి. అలాగే తాను సినిమా షూటింగ్ స‌మ‌యంలో కొన్ని చేయాల‌నిపించ‌దు కానీ ప్రేక్ష‌కుల కోసం చేయ్యాలి. 
 
అలాగే త‌న ప‌ర్స్ న‌ల్ లైఫ్ గురించి కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. త‌న‌కు చిన్నత‌నం నుంచి కాఫీ తాగ‌డం అంటే ఇష్టం ఉండ‌ద‌ని చెప్పింది. ఎవ‌రైనా కాఫీ తాగేట‌ప్పుడు వారివైపు క‌న్నెత్తి కూడా చూడ‌న‌ని చెప్పింది. చాలామంది ఒక పూట అన్నంలేకున్నా త‌ట్టుకుంటారేమో కానీ కాఫీ లేకుండా ఉండ‌లేర‌ని అన్నారు. ఇంకొంత మంది అయితే గ్లాసులు గ్లాసులు తాగేస్తుంటారని ఈ ముద్దుగుమ్మ త‌న మ‌న‌సులో మాట చెప్పింది. 
 
అలా అని తాను కూడా కాఫీ తాగ‌న‌ని అర్థం కాదు తాను కూడా కాఫీ తాగుతాన‌ని చెప్పింది. అయితే వారికి త‌న‌కు తేడా ఏంటంటే వారు కాఫీని టేస్ట్‌ కోసం తాగుతారు, తాను మాత్రం టేస్ట్‌ కోసం కాకుండ కేవలం మెడిసెన్ గా అనుకుని తాగుతాను అని చెప్పింది. ప్రతి రోజూ ఉదయం జిమ్‌కి వెళ్లడానికి ముందు తక్కువ మోతాదులో బ్లాక్‌ కాఫీ తాగుతాన‌ని చెప్పింది పూజా హెగ్డే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.