నా మొదటి సంపాదన 200 రూపాయలు.. పూజ హోగ్దే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pooja hegde
Updated:  2018-10-24 03:05:11

నా మొదటి సంపాదన 200 రూపాయలు.. పూజ హోగ్దే

మొదట చేసిన రెండు చిత్రాలు ముకుందా ఒక లైలా కోసం లో అభినయం తో ఆకట్టుకున్నా, ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు పూజ హెగ్డే కి. దాంతో బాలీవుడ్ కి వెళ్లి లక్ పరీక్షించుకుంది ఈ పొడుగుకాళ్ళ సుందరి.బాలీవుడ్ లో హృతిక్ రోషన్ కు జోడీగా మహోంజదారో చిత్రంలో నటించింది. ఆ చిత్ర ఫలితం కూడా అంత ఆశాజనకంగా లేకపోవడంతో మళ్ళీ ఈ భామ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈసారి కొంచెం అందాల ఆరబోత జత చేసి అల్లు అర్జున్ సరసన డి జే లో నటించింది.

ఆ సినిమా ఫలితం మాట ఎలా ఉన్నా అక్కడనుండి వరుస సినిమాలతో బిజీ అయిపోయింది పూజ. ఈమధ్యనే ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకుంది పూజ. దాంట్లో తన మొదటి సంపాదన గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది. తన మొదటి సంపాదన అక్షరాల రెండు వందల రూపాయలు అని చెప్పింది. నేను స్కూల్ లో ఉన్న సమయంలోనే నాకు మొదటి సంపాదన వచ్చింది. అది ఇచ్చింది మరెవ్వరో కాదు మా తాతగారు. నా చేతి రాత చాలా బాగుంటుందని అంతా అనేవారు - అందుకే ఒకసారి మా తాతగారు ముంబయి అథ్లెటిక్ అసోషియేషన్ లో పాల్గొన్న విద్యార్థుల పేర్ల జాబితాను రాయమన్నారు. ఆ జాబితాను నేను చాలా అందంగా రాశాను నేను రాసిన లిస్ట్ ఆయనకు బాగా నచ్చడంతో అప్పుడే నాకు 200 రూపాయలు ఇచ్చారు.

అదే నా నేను సంపాదించిన తొలి సంపాదనగా చెప్పుకుంటాను.  అని అసలు విషయం చెప్పింది ఈ భామ.ఆ రెండువందలు చేతికి వచ్చాక తన ఆనందానికి హద్దులు లేవని ఆ సందర్భాన్ని గుర్తుచేస్కొని నవ్వుకుంది పూజ హోగ్డే.