ప‌వ‌న్ క‌ళ్యాణ్ నా ల‌వ్‌..పూన‌మ్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan and poonam kour
Updated:  2018-09-05 04:46:40

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నా ల‌వ్‌..పూన‌మ్‌

మొన్నామధ్య పవన్ కళ్యాణ్ తో తిరుపతి వెళ్ళింది అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలతో చీకటినుండి బయటకొచ్చిన పూనమ్ కౌర్ తాజాగా మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఆమె తన ట్విట్టర్ అకౌంట్ లో పీకే లవ్ అని ఒక టాగ్ తో పోస్ట్ పెట్టింది. అది మొదలు నెటీజన్స్ ఈ పాప ని ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు ఆమె బాధపడుతూ తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేసింది.
 
మొన్న కృష్ణాష్టమి సందర్భంగా ఈ అమ్మడు ఓ చిన్న వీడియో పోస్ట్ చేసింది. చాలా క్యూట్ గా కనిపించి అందరి మనసులు దోచేసిన ఈ బ్యూటీ మరో ట్వీట్ తోనే విలన్ అయిపోయింది.ఆ తర్వాత ఆమె ఈ విధంగా ట్వీట్ చేసింది. “నా కృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా... నా గుండె లోతుల్లో ఉన్న ప్రేమను, సంతోషాన్ని వ్యక్త పరుస్తూ ఏదైనా చేయాల‌నుకుంటున్నాను.
 
ఏ సమయంలో అయినా దాన్ని రిలీజ్ చేస్తాను #pklove”. అది మొదలు ఆమె మీద జనసైనికులు పవన్ అభిమానులు విరుచుకుపడ్డారు. ఆమెని ట్రోల్స్ చెయ్యడం మొదలెట్టారు. బాధపడుతూ ఆమె మరో ట్వీట్ సందేశాన్ని పంపారు. ‘నేను ఎంతగా కష్టపడ్డా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత నిజాయితీగా చేసినా.... ఎవరూ పట్టించుకోరు. కానీ కొన్ని విషయాల్లో నా తప్పు లేక పోయినా నన్ను దూషిస్తున్నారు. ఇది నన్ను చాలా బాధించింది. నా హృదయానికి చాలా దగ్గరయిన వీడియో అది' అంటూ పూనమ్ బాధ పడింది పాపం.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.